AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balagam Narsingam: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ‘బలగం’ నటుడి కన్నుమూత.. ప్రముఖుల నివాళి

ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 31న థియేటర్లలో విడుదలైన బలగం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ రూపొందిన ఈ సినిమా పలువురి ప్రశంసలు పొందింది. అంతర్జాతీయంగా వందకు పైగా పురస్కారాలు వచ్చాయి. వీటన్నిటికీ మించి తెలంగాణ పల్లెల్లో తెరలు ఏర్పాటు చేసుకుని మరీ బలగం సినిమాను వీక్షించారు.

Balagam Narsingam: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 'బలగం' నటుడి కన్నుమూత.. ప్రముఖుల నివాళి
Actor Narsingam, Director Venu
Follow us
Basha Shek

|

Updated on: Sep 05, 2023 | 6:50 PM

ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొట్టిన మూవీ బలగం. జబర్దస్త్‌ కమెడియన్‌ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫీల్‌ గుడ్‌ మూవీలో ప్రియ దర్శి, కావ్యా కల్యాణ్‌ రామ్‌ హీరో, హీరోయిన్లుగా నటించారు. సుధాకర్‌ రెడ్డి, జయరామ్‌, రూప, రచ్చరవి, మురళీధర్‌ గౌడ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అగ్రనిర్మాత దిల్‌రాజు బలగం సినిమాను నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 31న థియేటర్లలో విడుదలైన బలగం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ రూపొందిన ఈ సినిమా పలువురి ప్రశంసలు పొందింది. అంతర్జాతీయంగా వందకు పైగా పురస్కారాలు వచ్చాయి. వీటన్నిటికీ మించి తెలంగాణ పల్లెల్లో తెరలు ఏర్పాటు చేసుకుని మరీ బలగం సినిమాను వీక్షించారు. అంతలా జనాల్లోకి వెళ్లిందీ మూవీ. ఇదే బలగం సినిమాలో సర్పంచ్ పాత్రలో కనిపించారు నర్సింగం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతోన్న ఆయన మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ దుర్వార్తను బలగం దర్శకుడు వేణు యెల్దండి సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. నటుడు నర్సింగంతో కలిసున్న ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన వేణు.. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

నా కోసం కళ్లు, గుడాలు తెప్పించారు..

‘నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి. మీచివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి. బలగం కథ కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను. ఆరోజు కళ్లు, గుడాలు తెప్పించారు నాకోసం’ అంటూ బలగం సినిమా షూటింగ్‌ నాటి రోజులను గుర్తుకు తెచ్చుకుని ఎమోషనల్‌ అయ్యాడు వేణు. ప్రస్తుతం వేణు ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నర్సింగం మరణవార్తను తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. నర్సింగం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం బలగం సినిమా గురించి మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ వేణు యెల్దండి ఎమోషనల్ పోస్ట్

 డైరెక్టర్ వేణు యెల్దండి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..