Balagam: ప్రాణాపాయ స్థితిలో బలగం నటుడు.. దర్శకుడు వేణు, హీరో ప్రియదర్శి ఆర్థిక సాయం.. అయినా..
`బలగం` సినిమాలో హీరో ప్రియదర్శి చిన్న తాతగా అంజన్న పాత్రలో అద్భుతంగా నటించారు జీవీ బాబు. పల్లె టూర్లలో తాతలు ఎలా ఉంటారో అలానే ఎంతో సహజంగా నటించి మెప్పించారు. అలాంటి నటుడు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

తెలంగాణ సంస్కృతి, ఆచారాలను ప్రతిబింబిస్తూ తెరకెక్కిన చిత్రం బలగం. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో, హీరోయిన్లుగా నటించారు. అలాగే రూప లక్ష్మి, మురళీధర్ గౌడ్, సుధాకర్‌రెడ్డి, వేణు, రచ్చ రవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రెండేళ్ల క్రితం విడుదలైన ‘బలగం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో భాగమైన నటీనటులందరికీ కూడా ఎంతో మంచి పేరు వచ్చింది. చాలా మందికి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. కాగా ఇదే బలగం సినిమాలో ప్రియదర్శికి చిన్నతాత అంజన్నగా అద్భతంగా నటించారు జీవీ బాబు. కథని ముందుకు తీసుకోవడంలో ఆయనదే కీలక పాత్ర. మన పల్లె టూర్లలో తాతలు ఎలా ఉంటారో అలాగే ఎంతో సహజంగా నటించి మెప్పించారు జీవీ బాబు. అలాంటి నటుడు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కిడ్నీలు దెబ్బ తినడం, గొంతుకు ఇన్ ఫెక్షన్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నోట మాట కూడా రాకపోవడంతో తన బాధను కూడా చెప్పలేకపోతున్నాడు. చాలా రోజులుగా ఆయనకు డయాలసిస్ చేస్తున్నారు. దీంతో ఆసుపత్రి బిల్లు చెల్లించలేక కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు
జీవీ బాబు ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న బలగం దర్శకుడు వేణు, ప్రియ దర్శి తదితరులు తమకు తోచినంత ఆర్థిక సహాయం చేశారు. అయితే జీవీ బాబు ఆస్పత్రి బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. దీంతో కనీసం మందులు కూడా కొనలేకపోతున్నారు. దీంతో తమకు సహాయం చేయాలని, ఆదుకోవాలని వారి కుటుంబ సభ్యులు ప్రాదేయపడుతున్నారు. దాతల కోసం వేచి చూస్తున్నారు.
కాగా గతంలో బలగం సినిమా నటుడు మొగిలయ్యకు కూడా ఇలాంటి దీన పరిస్థితి వస్తే.. ప్రభుత్వంతో పాటు కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి లాంటి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆదుకున్నారు. వైద్య ఖర్చులకు తమకు తోచినంత ఆర్థిక సాయం చేశారు. ప్రస్తుతం జీవి బాబు పరిస్థితి కూడా అలాగే ఉంది. మరి ప్రభుత్వంతో పాటు ఎవరైనా సహాయం చేయకపోతారా? అని వారి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







