AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: ‘మరో జన్మంటూ ఉంటే నువ్వే భర్తగా రావాలి’.. ఫ్యామిలీ ఫొటోస్ షేర్ చేస్తూ మంచు మనోజ్ భార్య ఎమోషనల్

మంచు వారబ్బాయి, హీరో మనోజ్ కుమార్ ఇవాళ (మే20) పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ హీరోకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా మనోజ్ సతీమణి ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

Manchu Manoj: 'మరో జన్మంటూ ఉంటే నువ్వే భర్తగా రావాలి'.. ఫ్యామిలీ ఫొటోస్ షేర్ చేస్తూ మంచు మనోజ్ భార్య ఎమోషనల్
Manchu Manoj Family
Basha Shek
|

Updated on: May 20, 2025 | 4:52 PM

Share

సుమారు ఆరేళ్ల తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నాడు టాలీవుడ్ హీరో మంచు మనోజ్. అతను నటించిన తాజా చిత్రం భైరవం. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కూడా హీరోలుగా నటించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా మంగళవారం (మే20) మంచు మనోజ్ కుమార్ పుట్టిన రోజు. కుటుంబీకులు, బంధువులు, సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మంచు వారబ్బాయికి బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ క్రమంలోనే మనోజ్ భార్య మౌనికా రెడ్డి తన భర్తకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపింది. తన పిల్లలు, భర్తతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ నేను ప్రేమించే నా సోల్‌మేట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా జీవితాల్లో వచ్చి.. మీ జీవిత ప్రయాణాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీరు ఈ ప్రపంచాన్ని ఎంతో అందమైన ప్రదేశంగా మార్చారు. మీరు చేయబోయే అన్ని పనులు మంచిగా, బాగా జరగాలి. మీ ప్రేమ, ఆనందాన్ని పంచడానికి మీ హృదయం వెయ్యేళ్లు బతకాలి. ఈ ఏడాది మాత్రమే కాదు.. నువ్వు అన్ని సంవత్సరాలు మీరు గొప్పగా ఉండాలి. మేము నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాం. మీ జీవితం మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాం. మా ముగ్గురి ప్రేమ మీ కోసం మాత్రమే. మీరు నిజంగా మా రాకింగ్ స్టార్‌. ప్రియమైన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ప్రతి పునర్జన్మలో నా స్నేహితుడిగా, భర్తగా మిమ్మల్నే ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.’ అంటూ భర్తపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చింది మౌనిక.

ఇవి కూడా చదవండి

మనోజ్ భార్య షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. అలాగే ఫొటోస్ కూడా నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో వారు కూడా మనోజ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా భైరవం సినిమాతో డైరెక్టర్ శంకర్ కూతురు అదితీ శంకర్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. ఆమెతో పాటు ఆనంది, దివ్య పిళ్లై ఈ మూవీలో హీరోయిన్లుగా నటించారు. కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మౌనిక ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

భర్త, పిల్లలతో మౌనిక..

View this post on Instagram

A post shared by Manoj Manchu (@manojkmanchu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..
ఏంటీ.. ఆ పాపులర్ సింగర్ ఈ నటుడి కూతురా.. ?
ఏంటీ.. ఆ పాపులర్ సింగర్ ఈ నటుడి కూతురా.. ?
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!