- Telugu News Photo Gallery Cinema photos Actress Trisha Krishnan Latest Crazy Photos Goes Viral, Know About Her Remuneration Per Movie
Trisha: కుర్ర హీరోయిన్లకు చుక్కలు చూపిస్తున్న త్రిష.. 42 ఏళ్ల వయసులో అందంలో అరాచకమే..
దక్షిణాది సినీప్రియులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని హీరోయిన్ త్రిష. దాదాపు రెండు దశాబ్దాలుగా కథానాయికగా సినీపరిశ్రమను ఏలేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఈ అమ్మడు అద్భుతమైన నటనతో క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియాగా మారింది. తాజాాగా సోషల్ మీడియాలో త్రిష షేర్ చేసిన ఫోటోస్ తెగ ఆకట్టుకుంటున్నాయి.
Updated on: May 20, 2025 | 4:34 PM

దక్షిణాది సినీరంగంలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ త్రిష. సైడ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అగ్ర కథానాయికగా మారింది ఈ అమ్ముడు. అందం, అద్భుతమైన నటనతో సినీప్రియులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.

దాదాపు రెండు దశాబ్దాలుగా వరుస హిట్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ప్రస్తుతం త్రిష వయసు 42 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందం, చేతినిండా సినిమాలతో కుర్ర హీరోయిన్లకు చుక్కలు చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఇటీవలే విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు థగ్ లైఫ్ చిత్రంతో అడియన్స్ ముందుకు రాబోతుంది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈసినిమాతోపాటు మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలోనూ నటిస్తుంది. అంతేకాకుండా అటు తెలుగు, తమిళంలో మరిన్ని ఆఫర్స్ అందుకుంటూ కుర్రహీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తుంది త్రిష.

అంతేకాకుండా ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా రూ.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో త్రిష షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. 42 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన అందంతో మెస్మరైజ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.




