AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఆ యంగ్ క్రికెటర్ కు హగ్ ఇవ్వలేదు.. వైరల్ ఫొటోస్‌పై ప్రీతి జింటా క్లారిటీ

ఐపీఎల్‌-2025లో భాగంగా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 10 ప‌రుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజ‌యం సాధించింది. అయితే ఈ మ్యాచ్ అనంత‌రం రాజ‌స్తాన్ యంగ్ క్రికెటర్ ను బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా హ‌గ్ చేసుకున్న‌ట్లు కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చ‌క్కెర్లు కొడుతున్నాయి.

IPL 2025: ఆ యంగ్ క్రికెటర్ కు హగ్ ఇవ్వలేదు.. వైరల్ ఫొటోస్‌పై ప్రీతి జింటా క్లారిటీ
Preity Zinta
Basha Shek
|

Updated on: May 20, 2025 | 7:11 PM

Share

వైభవ్ సూర్య వంశీ.. ప్రస్తుతం భారత క్రికెట్‌లో ఈ 14 ఏళ్ల యంగ్ క్రికెటర్ పేరు బాగా వినిపిస్తోంది. ఈ ప్లేయర్ దూకుడు చూస్తుంటే త్వరలోనే భారత జట్టులోకి రావచ్చునని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతలోనే వైభవ్ గురించి ఒక తప్పుడు వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇదే విషయంలో బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత, వైభవ్ సూర్యవంశీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ ఫొటోల్లో వైభవ్ ను ప్రీతి జింటా హగ్ చేసుకున్నట్లు చూపించారు. దీంతో కొందరు నెటిజన్లు ప్రీతి జింటాపై విమర్శల వర్షం కురిపించారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారు. అంతేకాకుండా 14 ఏళ్ల ఆటగాడికి అలా హాగ్ ఇవ్వ‌డం ఏంట‌ని కొన్ని వెబ్ సైట్లు కూడా నెగెటివ్ క‌థ‌నాలు ప్ర‌చ‌రించాయి. తాజాగా ఇదే విష‌యంపై ప్రీతి జింటా స్పందించారు. ఈ ఫోటోలు పూర్తిగా ఫేక్ అని, వార్తా ఛానెళ్లు కూడా ఇలాంటి తప్పుడు చిత్రాలను ప్రసారం చేయడ‌మేంట‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

‘ఇది మార్ఫింగ్ చేసిన ఫోటో. త‌ప్పుడు వార్త‌ల‌ను ఎలా ప్ర‌చారం చేస్తున్నారు. ఆఖ‌రి న్యూస్ ఛానెల్స్ కూడా మార్ఫింగ్ చేసిన చిత్రాలను ఉపయోగించి వాటిని వార్తలుగా చూపిస్తున్నాయి. వీటిని చూసి నేను ఆశ్చ‌ర్య‌పోయాను’ అని ఎక్స్ (ట్విట్టర్) లో రాసుకొచ్చింది ప్రీతి జింటా. దీంతో ఈ వైరల్ ఫొటోపై ప్రీతి జింటా స్వయంగా స్పందించింది.

నెట్టింట వైరలవుతోన్న ఫొటోస్ ఇవే..

Preity Zinta

Preity Zinta

ప్రీతి జింటా ట్వీట్..

నిజం చెప్పాలంటే మే 17న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా వైభవ్ సూర్యవంశీని కలిసింది. అక్కడ వారిద్దరూ జస్ట్ కరచాలనం చేసుకుని మాట్లాడుకున్నారంతే. అంతే కానీ ప్రీతి జింటా వైభవ్‌ను హగ్ చేసుకోలేదు. కానీ కొందరు నెటిజన్లు వారిపై మార్ఫింగ ఫొటోలు క్రియేట్ చేసి నెట్టింట వైరల్ చేశారు.

వైభవ్ సూర్యవంశీతో ప్రీతి జింటా..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
చేపలు పడుతుండగా వ్యక్తికి ఊహించని షాక్.. నీటి లోపల నుంచి..
చేపలు పడుతుండగా వ్యక్తికి ఊహించని షాక్.. నీటి లోపల నుంచి..