IPL 2025: ఐపీఎల్ మ్యాచ్ వేదికల్లో మార్పు! ఫైనల్ అక్కడే.. RCB ఫ్యాన్స్‌కు పండగే!
ఐపీఎల్ 2025లో బీసీసీఐ కీలకమైన మార్పులను ప్రకటించింది. బెంగళూరులోని ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లక్నోకు మార్పు చెందింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మరియు క్వాలిఫైయర్ 2 జరుగనున్నాయి. క్వాలిఫైయర్ 1 మరియు ఎలిమినేటర్ మ్యాచ్‌లు న్యూ చండీగఢ్‌లో జరుగుతాయి. వర్షాల కారణంగా ఈ మార్పులు చేశారు.

ఐపీఎల్ 2025లో కొన్ని మ్యాచ్‌ల వేదికల్లో బీసీసీఐ మార్పులు చేసింది. ఈ నెల 23న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడయంలో జరగాల్సిన ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌ను లక్నోకు మార్పు చేశారు. అలాగే ఐపీఎల్ ఫైనల్, క్వాలిఫైయర్ 2ను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నారు. అలాగే క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు న్యూ చంఢీఘర్‌లో నిర్వహించనున్నారు.
బెంగళూరులో వర్షాల కారణంగా.. ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌ను బెంగళూరు నుంచి లక్నోకు మార్చారు. ఎలాగో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ రికార్డ్ బాగా లేకపోవడంతో వేదిక మార్పు మంచిదే అంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. కాగా, ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఇక మిగిలిన ఒక స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ రెండు టీమ్స్‌లో ఒక జట్టు ఫ్లే ఆఫ్‌కు చేరే ఛాన్స్ ఉంది.
Destination ▶ Playoffs
🏟 New Chandigarh 🏟 Ahmedabad
Presenting the 2️⃣ host venues for the #TATAIPL 2025 playoffs 🤩 pic.twitter.com/gpAgSOFuuI
— IndianPremierLeague (@IPL) May 20, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




