IPL Points Table: విజయంతో వీడ్కోలు చెప్పిన రాజస్థాన్.. 14 ఏళ్ల సెన్సేషన్ ఆటకు విరామం
IPL Points table Update After CSK vs RR Match: రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లు సాధించింది. చివరి మ్యాచ్‌లో విజయంతో ఈ సీజన్‌ను ముగిసింది. రాజస్థాన్ తన చివరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడించింది.

IPL Points table Update: మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది. రాజస్థాన్ రాయల్స్ 17.1 ఓవర్లలో 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి, విజయంతో సీజన్‌ను ముగించింది. రాజస్థాన్ తరపున వైభవ్ సూర్యవంశీ 33 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ తరపున 14 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌తో పాటు, యశస్వి జైస్వాల్ 19 బంతుల్లో 36 పరుగులు, కెప్టెన్ సంజు శాంసన్ 31 బంతుల్లో 41 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ కం బ్యాట్స్ మాన్ ధ్రువ్ జురెల్ 12 బంతుల్లో 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 18వ ఓవర్ మొదటి బంతికి మతిషా పతిరానా బౌలింగ్ లో సిక్స్ కొట్టడం ద్వారా రాజస్థాన్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్‌ను 14 మ్యాచ్‌లలో 8 పాయింట్లతో రాజస్థాన్ ముగించింది.
మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యువ బ్యాట్స్‌మెన్‌లు తమ కెరీర్‌లో ఎప్పుడూ గుర్తింపును కోల్పోవద్దని ఎంఎస్ ధోని సలహా ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం జరిగిన ఇంటర్వ్యూలో ధోని మాట్లాడుతూ, అధిక స్కోరింగ్ రేటుతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నిలకడను సాధించడం ఎంత కష్టమో చెప్పుకొచ్చాడు. కానీ, ఉన్నత స్థాయిలో ఆడుతున్నప్పుడు నిలకడను కొనసాగించాల్సిన అవసరాన్ని కూడా ధోని నొక్కి చెప్పాడు.
చెన్నై తరపున ఆయుష్ మాత్రే లేదా రాజస్థాన్ తరపున వైభవ్ సూర్యవంశీ వంటి యువ తారలు మరోసారి మ్యాచ్‌లో ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరు యువ తారలు వారి బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లలో కీలక పాత్రలు పోషించారు. కానీ, సూర్యవంశీ 188 పరుగుల లక్ష్య ఛేదనకు వేదికను సిద్ధం చేయడంతో రాయల్స్ జట్టు అజేయంగా నిలిచింది. బీహార్‌కు చెందిన ఈ యువ స్టార్ 33 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. యశస్వి జైస్వాల్ తొలి దశలోనే ఔట్ అయినప్పటికీ, ఆ యువ ఆటగాడు జట్టు కెప్టెన్ సంజు సామ్సన్‌కు గట్టి మద్దతు ఇచ్చాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








