Sai Pallavi: సాయి పల్లవి సెన్సేషనల్ కామెంట్స్ .. భగ్గుమన్న భజరంగ్ దళ్
రానా , సాయి పల్లవి(Sai Pallavi) నటించిన లేటెస్ట్ మూవీ విరాట పర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రానా , సాయి పల్లవి(Sai Pallavi) నటించిన లేటెస్ట్ మూవీ విరాట పర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నెక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా నక్సలైట్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలో పాటలు, పోస్టర్లు , టీజర్, గ్లిమ్ప్స్ సినిమా పై అంచనాలను పీక్స్ కు చేర్చాయి.ప్రస్తుతం చిత్రయూనిట్ అంతా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యల పై.. అలాగే ఈ సినిమా టైటిల్ పై వివాదం రేగింది. ఈ సినిమా టైటిల్ పై భజరంగ్ దళ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. విరాట పర్వం పేరును తప్పుగా వాడుతున్నారని భజరంగ్ దళ్ ఆరోపిస్తోంది. అలాగే సాయి పల్లవి చేసిన వ్యాఖ్యల పై కూడా సీరియస్ అయ్యింది బజరంగ్ దళ్.
తాజాగా ఓ ఇంట్రవ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. కశ్మీర్ పండిట్ల మారణఖండ .. గో హత్యలకు ఉన్న సంబందం గురించి మాట్లాడింది. దీనిపై బజరంగ్ దళ్ భగ్గుమంది. మహాభారతం లోని పాండవుల అజ్ఞాత ఘట్టమైన విరాట వరవాన్ని టైటిల్ తప్పుగా వాడారని సెన్సార్ బోర్డ్ కి కంప్లైంట్ చేశారు భజరంగ్ దళ్ సభ్యులు. సినిమా టైటిల్ మీద అబ్యతరం చెప్పాలని సెన్సార్ బోర్డ్ ని కోరారు భజరంగ్ దళ్ కన్వీనర్ శివరాములు. సినిమాలో హిందూ ధర్మాన్ని కించపరిచే సన్నివేశాలు ఉంటే వెంటనే తొలగించాలని లేకుండా సినిమా ప్రదర్శనలను అడ్డుకుంటామని తెలుపుతూ వారు సెన్సార్ బోర్డ్ కు ఓ లేఖ రాసారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.