
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం ‘బేబీ’. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో విరాజ్ అశ్విన్ మరో కీలక పాత్రలో నటించాడు. సాయి రాజేష్ దర్శకత్వంలో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ బేబీ మూవీని నిర్మించారు. జులై 14 న విడుదలైన బేబీ మూవీ అంచనాలకు మించి వసూళ్లు రాబడుతోంది. సాలిడ్ టాక్‌తో నిర్మాతలకు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కావడంతో ముఖ్యంగా యువత బేబీ సినిమాకు బ్రహ్మరథం తున్నారు. అందుకు తగ్గట్టే తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ఈ మూవీకి కలెక్షన్లు హోరెత్తుతున్నాయి. మొదటి రోజే 7 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకున్న బేబీ వరుసగా రెండో రోజు కూడా 7 కోట్లకి పైగానే గ్రాస్ ని రాబట్టింది. వీకెండ్‌కు తోడు బోనాల పండగ కూడా కలిసి రావడంతో ఆనంద్ దేవరకొండ సినిమా రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 14.3 కోట్ల గ్రాస్ ని అందుకుంది. ఈ విషయాన్ని బేబీ నిర్మాత ఎస్‌కేఎన్ సోషల్ మీడియా ద్వారా పంచుకుని మురిసిపోయారు.
‘బేబీ సినిమాపై ప్రేక్షకులు కురిపిస్తోన్న ప్రేమాభిమానాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్. అలాగే మూడో రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోయాయని, ఈ రేంజ్ సక్సెస్ ఊహించలేదని నిర్మాత హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో బోనాలు నడుస్తున్నాయి. మరోవైపు మహావీరుడు, నాయకుడు డబ్బింగ్ సినిమాలు కావడంతో బేబీకే ఓటేస్తున్నారు ప్రేక్షకులు. అదే వసూళ్ల రూపంలో కనిపిస్తోంది. బేబీ సినిమాకు విజయ్ బుల్గానిన్ అందించిన స్వరాలు, బీజీఎం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.
Thank you
Thank you
Thank you
For all the love affection and compliments ❤️
No words
And on the 3rd day (Sunday) Bookings are Sensational, never imagine we’ll get such a warm reception
Love u all 🙏❤️#BabyTheMovie @sairazesh@ananddeverkonda @viraj_ashwin@iamvaishnavi04… pic.twitter.com/PvA5qLSXgv— SKN (Sreenivasa Kumar) (@SKNonline) July 16, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..