AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Pakistan War: వారికి మరణం తప్పదు.. భారత్-పాక్ యుద్ధంపై వేణు స్వామి సంచలన జోస్యం.. వీడియో వైరల్

భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య అనధికారికంగా యుద్ధం ప్రారంభమైంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడులు, ప్రతిదాడులతో హోరెత్తిస్తున్నాయి. మరి ఈ యుద్ధంలో అంతిమ విజయం ఎవరిది? ఇదే విషయంపై జోస్యం చెప్పారు వేణు స్వామి.

India Pakistan War: వారికి మరణం తప్పదు.. భారత్-పాక్ యుద్ధంపై వేణు స్వామి సంచలన జోస్యం.. వీడియో వైరల్
Venu Swamy
Basha Shek
|

Updated on: May 10, 2025 | 5:26 PM

Share

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరిట పాక గుండెల్లో గుబులు పుట్టిస్తోంది భారత్. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)తో పాటు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత్ వందల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టింది. అయినా బుద్ధి తెచ్చుకోని పాక్ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్ లోని కొన్ని ముఖ్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో దాడులకు దిగుతోంది. అయితే భారత సాయుధ దళాలు పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పి కొడుతున్నాయి. ఈ క్రమంలో భారత్- పాక్ మధ్య యుద్ధ పరిస్థితులపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి స్పందించారు. భారత్ – పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందని తాను ముందే చెప్పాను ఓ పాత వీడియోని గుర్తు చేశారు. అలాగే ఈ యుద్ధంతో ఎలాంటి పర్యవసానాలు తలెత్తుతాయో చెబుతూ సోషల్ మీడియాలో ఆయన ఒక వీడియోను షేర్ చేశారు.

‘భారత్ తో పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందని నేను ముందే చెప్పాను. ఉగాది పండగకు పది రోజులు ముందుగా వీడియోని చేశాను. గతంలో మహా భారత యుద్ధం కేవలం 5 గ్రామల కోసమే జరిగింది. అంటే భూమి కోసమే. ఇప్పుడు కూడా భారత్- పాక్ దేశాల మధ్య యుద్ధం కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసమే జరుగుతోంది. ఇది చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో చెప్పలేం.  ఈ యుద్ధంతో పాకిస్తాన్ 80 శాతం నాశనం అవుతుంది. షష్ఠ గ్రహ కూటమి వల్ల ప్రపం చ వ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు తలెత్తుతాయని నేను ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడదే జరగబోతోంది. రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయంగా పలు సంచలనాలు నమోదవుతాయి. మీన రాశిలో శని, శుక్రుల కలయిక అనేది చాలా డేంజర్. పెద్ద నాయకులు, ప్రముఖులు మరణిస్తారు. ఆర్ధిక మాంద్యం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది’ అని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన వారందరూ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఈ మధ్యన సోషల్ మీడియాలో తాను షేర్ చేస్తోన్న వీడియోలకు కామెంట్ సెక్షన్ ని ఆఫ్ చేస్తున్నారు వేణు స్వామి. ప్రస్తుతం ఈ వీడియోకు కూడా కామెంట్ సెక్షన్ ను ఆపేశారు.

ఇవి కూడా చదవండి

వేణు స్వామి షేర్ చేసిన వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్