Love Me Movie Review: “లవ్ మీ” మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య జంటగా దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించిన సినిమా లవ్ మీ. ఈ సినిమాతో అరుణ్ భీమవరపు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. దెయ్యంతో ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Love Me Movie Review: లవ్ మీ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..
Love Me
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: May 25, 2024 | 1:51 PM

మూవీ రివ్యూ: లవ్ మీ నటీనటులు: ఆశిష్, వైష్ణవి చైతన్య, రవికృష్ణ, సిమ్రాన్ చౌదరి, సంయుక్త మీనన్ తదితరులు సంగీతం: ఎంఎం కీరవాణి సినిమాటోగ్రఫీ: పిసి శ్రీరామ్ ఎడిటర్: సంతోష్ కామిరెడ్డి నిర్మాతలు: హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: అరుణ్ భీమవరపు

ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య జంటగా దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించిన సినిమా లవ్ మీ. ఈ సినిమాతో అరుణ్ భీమవరపు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. దెయ్యంతో ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

అనగనగా ఓ ఊరు.. ఆ ఊళ్ళో భార్యా భర్తలతో ఓ చిన్న కుటుంబం ఉంటుంది. రాత్రి అయితే చాలు 8 నుంచి 9 గంటల మధ్యలో ఆ ఇంటి నుంచి ఏడుపులు వినిపిస్తుంటాయి. అనుకోకుండా ఒకరోజు రాత్రి భార్య ఒంటికి నిప్పు అంటించుకుని చచ్చిపోతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు భర్త కూడా చనిపోతాడు. కానీ వాళ్లకు ఓ పాప ఉంటుంది. ఆ సీన్ అక్కడితో అయిపోతుంది. అసలు కథలోకి వస్తే.. అర్జున్ (ఆశిష్ రెడ్డి), ప్రతాప్ (రవికృష్ణ) ఇద్దరూ అన్నాదమ్ములు. వాళ్లిద్దరూ ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలు ఇలాంటి వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటారు. వాళ్ల ఛానెల్‌లోనే కంటెంట్ హెడ్‌గా పని చేస్తుంటుంది ప్రియ (వైష్ణవి చైతన్య). ప్రియ కేవలం హెడ్ మాత్రమే కాదు ప్రతాప్ గాళ్ ఫ్రెండ్. ఓ రోజు ప్రతాప్‌కు ఆ ఇంట్లో ఉండే పాప గురించి తెలుస్తుంది. కొన్ని రోజులకే ఆ పాప చనిపోయిందని.. అదే ఇంట్లో దివ్యావతి అనే పేరుతో దెయ్యమై ఉంటుందని అర్జున్‌కు చెప్తాడు. దాంతో ఆ దెయ్యం కథేంటో చూడాలని బయల్దేరతాడు అర్జున్. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఆ దెయ్యంతోనే ప్రేమలో పడతాడు అర్జున్. అక్కడ్నుంచి అసలు ఆ దివ్యవతి ఎవరు..? ఎందుకు చనిపోయింది.. ఎలా చనిపోయింది అని వేట మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే అర్జున్‌కు కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. అవేంటి అనేది అసలు కథ..

కథనం:

అనగనగా ఓ ఊరు.. ఆ ఊళ్ళో ఓ దెయ్యం.. దాన్ని చూస్తే అందరికీ భయం.. ఇలాంటి హార్రర్ కథలు ఇండస్ట్రీలో చాలానే వచ్చాయి. లవ్ మీ కూడా ఇలాంటి కథే.. కాకపోతే ఇక్కడ దెయ్యాన్నే మన హీరో భయపెడతాడు. అది చాలా కొత్తగా అనిపించే పాయింట్. ఇప్పటి వరకు దెయ్యాల్ని చూసి భయపడే వాళ్లనే చూసాం కానీ.. దెయ్యంతో ప్రేమలో పడటం.. ఆ దెయ్యం కూడా హీరోపై మనసు పడటం మాత్రం కొత్తగా అనిపిస్తుంది. మనం రొటీన్‌గా చూసే దెయ్యం స్టోరీ అయితే కాదు లవ్ మీ.. మొదటి 15 నిమిషాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా మొదలైంది. చెప్పులు వేసుకోకపోవడం.. స్మశానాల్లో తిరగడం.. మెడలో రుద్రాక్ష.. ఎప్పుడూ నల్ల బట్టలే వేసుకోవడం.. ఇలా హీరో కారెక్టరైజేషన్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఫస్టాఫ్ వరకు చాలా సస్పెన్స్‌తో.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కథను నడిపించాడు దర్శకుడు అరుణ్ భీమవరపు. అక్కడి వరకు వచ్చే సన్నివేశాలు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా హీరో దెయ్యం ఉండే అపార్ట్‌మెంట్‌లోకి వెళ్తున్నపుడు వచ్చే సీన్స్ చాలా బాగుంటాయి.. దానికి తగ్గ సినిమాటోగ్రఫీతో రేంజ్ పెరుగుతుంది. కానీ కీలకమైన సెకండాఫ్ మాత్రం పూర్తిగా పట్టు తప్పింది. ముఖ్యంగా స్టోరీ రివీలింగ్ పాయింట్ అయిన దెయ్యాన్ని చూపించే సీన్ తేలిపోయింది. దాని బ్యాక్ స్టోరీ కూడా ఏమంత ఆసక్తికరంగా అనిపించదు. అప్పటి వరకు మెయింటేన్ చేసిన సస్పెన్స్ కూడా ఒక్క సీన్‌తో తేలిపోయినట్లు అనిపిస్తుంది. కాకపోతే మరీ రొటీన్ దెయ్యం కథల్లా కాకుండా.. కొత్తగా డీల్ చేసాడు దర్శకుడు. దెయ్యాన్ని చూసేవరకు ఓకే.. దాంతో ప్రేమలో పడటం అనేది కొత్త పాయింట్. అయితే రాసుకున్నంత కన్విన్సింగ్‌గా స్క్రీన్ మీద దాన్ని ప్రజెంట్ చేయలేకపోయాడు. దానికితోడు కన్ప్యూజింగ్ స్క్రీన్ ప్లే కూడా ఇబ్బంది పెడుతుంది. కథ ముందుకు వెళ్తున్న కొద్దీ అనుమానాలు ఎక్కువగా వస్తాయి. ఓ టైమ్‌లో వాటిని రివీల్ చేసే ప్రయత్నం చేసినా.. కన్ఫ్యూజింగ్‌గానే అనిపిస్తుంది స్క్రీన్ ప్లే. చివర్లో మళ్ళీ ఓ ట్విస్ట్ ఇచ్చి సెకండ్ పార్ట్‌కు లీడ్ ఇవ్వడం కొసమెరుపు. ఇందులో వైష్ణవి చైతన్య కాకుండా మరో నలుగురు హీరోయిన్లు ఉన్నారు.

నటీనటులు:

ఆశిష్ రెడ్డి తన పాత్రకు బాగానే న్యాయం చేసాడు.. రౌడీ బాయ్స్‌తో పోలిస్తే మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇది. రొటీన్ కమర్షియల్ కాకుండా కొత్తగా ఉండే కారెక్టర్ ఎంచుకున్నాడు. వైష్ణవి చైతన్య మరోసారి ఆకట్టుకుంది.. నటన పరంగా ఈ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది. కానీ కారెక్టర్స్ ఎంచుకునేటప్పుడు మాత్రం కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇలాంటి పాత్రలు ఆమె కెరీర్‌కు డేంజర్. అలా ఎందుకు చెప్పానో సినిమా చూస్తే అర్థమవుతుంది. సిమ్రాన్ చౌదరి పాత్ర కొత్తగా అనిపిస్తుంది. రవికృష్ణ కూడా తనకు ఉన్నంతలో బాగా నటించాడు. విరూపాక్ష తర్వాత మరో మంచి పాత్ర పడింది.

టెక్నికల్ టీం:

లవ్ మీ సినిమా గురించి ముందు నుంచి మాట్లాడుకుంటుంన్నది టెక్నికల్ టీం గురించే. ఎందుకంటే ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. పాటలు మాత్రం రెండు ఆకట్టుకుంటాయి. ఇక పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సుప్రీమ్. ఆయన కెమెరా వర్క్‌కు పేరు పెట్టాల్సిన పనిలేదు. చాలా చోట్ల తన కెమెరా వర్క్‌తో సినిమా స్వరూపమే మార్చేసాడు పిసి. ఎడిటింగ్ కాస్త వీక్.. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ డల్ అనిపిస్తుంది. కాకపోతే దర్శకుడి ఛాయిస్ కాబట్టి ఎడిటర్‌ను తప్పుబట్టలేం. ఇక దర్శకుడు అరుణ్ భీమవరపు నవలలను ఎక్కువగా చదువుతానని చెప్పాడు. అదే సినిమాలోనూ కనిపించింది. చాలా సేపటి వరకు ఓ నవల చూస్తున్నట్లుగానే సాగుతుంది సినిమా. కొంతవరకు మెప్పించినా.. చాలా వరకు కన్ఫ్యూజన్‌తో మెప్పించలేకపోయాడు అరుణ్.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా లవ్ మీ.. కన్ఫ్యూజన్ ఎక్కువ.. క్లారిటీ తక్కువ..

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు