మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej )కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలతో సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో.. ఇక గద్దల కొండ గణేష్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు వరుణ్. మాస్ క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేశాడు వరుణ్. ఇక ఈ మధ్య రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు ఈ మెగా హీరో.. వాటిలో గని సినిమా ఒకటి కిరణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. అలాగే అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 3. ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించి మంచి సక్సెస్ గా నిలించింది. ఇక ఇప్పుడు ఓ బయో పిక్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు వరుణ్.
ఈ క్రమంలోనే తాజాగా వరుణ్ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న వరుణ్.. మరో చిత్రాన్ని ప్రకటించాడు. వరుణ్ తేజ్ 13వ చిత్రంగా తెరకెక్కుతోన్న న్యూ మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ రీసెంట్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అంతకు ముందు విడుదల చేసిన ఓ చిన్న వీడియో ఆసక్తిని పెంచిన విషయం తెలిసిందే. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ప్రకటించడంతో అందరిలోనూ ఈ సినిమా కథపై ఇంట్రెస్టింగ్ పెరిగింది. ఇదిలా ఉంటే ట్విట్టర్ ఖాతా డీపీగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సింబల్ ని పెట్టుకున్నాడు వరుణ్ తేజ్. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ఐఎఎఫ్ పిలుపు మేరకు ఈ మెగా హీరో తన సోషల్ మీడియా డీపీని మార్చాడు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి గొప్ప నివాళిగా ఈ సినిమా ఉండబోతోంది. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా పాత్ర చాలా ఆసక్తికరంగా.. చాలా లేయర్స్ తో ఉంటుంది. దీని కోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాను అని వరుణ్ తెలిపారు.చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో.
#AtmaNirbharBharat https://t.co/Bs8C1I82VU
— Varun Tej Konidela (@IAmVarunTej) September 23, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..