Tollywood: ఏఎన్నార్ కళ్లముందే డైరెక్టర్‌ను చెప్పుతో కొట్టింది.. ఆ తర్వాత.!
టాలీవుడ్ నటి అర్చన తల్లి నల్ల సుశీల, ఒక దర్శకుడిని అక్కినేని నాగేశ్వరరావు చూస్తుండగానే చెప్పుతో కొట్టారట. ఆ దర్శకుడు మంచి పాత్రలు ఇస్తానని చెప్పి.. ఆమె నుంచి డబ్బు తీసుకుని మోసం చేయడమే దీనికి కారణం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

టాలీవుడ్ ప్రముఖులు, వారి జీవితాలలో జరిగిన కొన్ని సంఘటనలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాయి. ఇటీవల కనగల జయకుమార్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు టాలీవుడ్ అభిమానులను ఆశ్చర్యపరిచాయి. వీటిలో దివంగత నటుడు శరత్ బాబుతో తన అనుభవాల నుంచి అక్కినేని నాగేశ్వరరావు సమక్షంలో జరిగిన ఒక సంచలనాత్మక ఘటన వరకు అనేక సంఘటనలు ఉన్నాయి. శరత్ బాబు సాధారణంగా రాత్రి షూటింగ్‌లకు ఇష్టపడని వ్యక్తి అని జయకుమార్ తెలిపారు. ఒకసారి విజయగార్డెన్స్‌లో జరిగిన షూటింగ్ సందర్భంగా బాలీవుడ్ నటి మాలా సిన్హా శరత్ బాబుని కలుసుకోవడం ఒక ఆసక్తికరమైన సందర్భమని వివరించారు. మాలా సిన్హా తన కుమార్తె షూటింగ్‌లో పాల్గొనడానికి వచ్చినప్పుడు, శరత్ బాబును చూసి “సార్, ఐ యామ్ మాలా సిన్హా, ఐ యామ్ యువర్ ఫ్యాన్” అని చెప్పడం శరత్ బాబునే కాకుండా జయకుమార్‌ను కూడా ఆశ్చర్యపరిచిందని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఇది చదవండి: అతడి వల్లే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చా.. ఓపెన్‌గా చెప్పేసిన నటి
అయితే, జయకుమార్ చెప్పిన సంఘటనలలో అత్యంత షాకింగ్, సంచలనాత్మకమైనది నటి అర్చన తల్లి నల్ల సుశీల గురించి. నల్ల సుశీల నాటకరంగంలో గొప్ప నటి, అలాగే సినిమాలలో కూడా మంచి పాత్రలు పోషించారు. ఆమెను “నల్ల సుశీల” అని పిలిచేవారని, ఆమెకు ఒక నాటకంలో “బెస్ట్ యాక్టర్” అవార్డు కూడా వచ్చిందని జయకుమార్ పేర్కొన్నారు. ఈ నల్ల సుశీల ఒకసారి ఏఎన్ఆర్ సమక్షంలో ఒక దర్శకుడిని చెప్పుతో కొట్టిన ఘటన గురించి జయకుమార్ వెల్లడించారు. ఒక సినిమాలో డబ్బింగ్ జరుగుతుండగా, ఏఎన్ఆర్ డబ్బింగ్ చెబుతున్నారు. అప్పుడు ఆ దర్శకుడు, నిర్మాత కూడా అక్కడే ఉన్నారు. డబ్బింగ్ సమయంలో వచ్చిన బ్రేక్‌లో నల్ల సుశీల ఏఎన్ఆర్ వద్దకు వెళ్లి నమస్కరించి, ఆ తర్వాత నేరుగా ఆ దర్శకుడు-నిర్మాత వద్దకు వెళ్లి తన చెప్పు తీసుకుని “టపా టపా” అని రెండుసార్లు కొట్టారు. ఈ సంఘటన అక్కడ ఉన్న అందరినీ షాక్‌కు గురిచేసింది. దీనికి కారణం ఏమిటంటే, ఆ దర్శకుడు నల్ల సుశీలకు మంచి పాత్రలు ఇస్తానని చెప్పి, ఆమె నగలు తాకట్టు పెట్టించి డబ్బులు తీసుకుని, ఆ తర్వాత ఆమెను విస్మరించాడని జయకుమార్ వివరించారు. ఈ ఘటన జరిగినప్పుడు ఏఎన్ఆర్ కూడా షాకయ్యారు, అయితే అలాంటివి ఆయన జీవితంలో ఎన్నో చూసి ఉంటారని జయకుమార్ అభిప్రాయపడ్డారు.
ఇది చదవండి: ఒక్క ఇడ్లీ కోసం ఆ కో-డైరెక్టర్ బూతులు తిట్టాడు.. తర్వాత వాడి పరిస్థితి ఇది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
