AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మట్టి దిబ్బల కింద ధాన్యాన్ని ఎందుకు పాతి పెడతారంటే.? అక్కడ ఇదే ఆనవాయితీ..

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో పాత్ర ధాన్యం పేరుతో మట్టి దిబ్బల కింద ధాన్యాన్ని నిల్వ చేసే అరుదైన సంప్రదాయం ఉంది. ఇది కీటకాలు, వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడటమే కాకుండా పోషకాలను పుష్కలంగా ఉంచి, ఆరోగ్యాన్ని చేకూరుస్తుందని స్థానికులు నమ్ముతారు. తరతరాలుగా వస్తున్న ఈ పద్ధతిని వారసత్వంగా కొనసాగిస్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

Ravi Kiran
|

Updated on: Apr 02, 2026 | 11:45 AM

Share
 ఆధునిక కాలంలో ధాన్యం నిల్వ చేయడానికి పెద్ద పెద్ద గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు వాడుతుంటే, ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాలైన ఇచ్ఛాపురం, పలాస రైతులు మాత్రం తమ పూర్వీకుల నాటి 'పాత్ర ధాన్యం' పద్ధతినే నమ్ముకుంటున్నారు. పంట కోత తర్వాత ధాన్యాన్ని ఇంటి ముందు మట్టి గుంతల్లో భద్రపరిచే ఈ విధానం అటు సాంకేతికంగా, ఇటు ఆరోగ్యపరంగా ఎంతో మంచిది.

1 / 5
రైతులు తమ ఇంటి ముందు 5-6 అడుగుల లోతున గుంతలు తవ్వి, గడ్డితో లైనింగ్ చేసి ధాన్యాన్ని నింపుతారు. పైన ఎర్రమట్టి, ఆవు పేడతో సీల్ చేసి దిబ్బలా మారుస్తారు. ఇది ధాన్యాన్ని తేమ, పురుగుల నుంచి రక్షించడమే కాకుండా, సహజ సిద్ధమైన ఉష్ణోగ్రత వద్ద ధాన్యం మగ్గేలా చేస్తుంది.

2 / 5
ఈ పద్ధతిలో నిల్వ చేసిన ధాన్యాన్ని చిన్న మిల్లుల్లో పట్టించడం వల్ల బియ్యంపై ఉండే పోషక విలువలు పోవు. ఈ అన్నం రెండు రోజుల వరకు తాజాగా ఉంటుందని, ఆరోగ్యాన్ని కాపాడుతుందని స్థానికుల నమ్మకం. కేవలం నిల్వ పద్ధతిగానే కాకుండా, ఈ మట్టి దిబ్బలను లక్ష్మీదేవిగా భావించి పూజించడం ఇక్కడి సాంస్కృతిక విశిష్టత.

3 / 5
ఈ పద్ధతిలో నిల్వ చేసిన బియ్యం తింటే జబ్బులు దరిచేరవని స్థానికుల నమ్మకం. చిన్న మిల్లుల్లో పట్టించడం వల్ల బి-కాంప్లెక్స్ వంటి పోషకాలు చెక్కుచెదరవు. ఈ అన్నం రెండు రోజుల వరకు తాజాగా ఉండటం దీని ప్రత్యేకత. అందుకే వృద్ధులకు, పిల్లలకు ఇది ఎంతో మేలు.

4 / 5
ఆధునిక యంత్రాలు, కెమికల్స్ లేని కాలంలోనే మన పూర్వీకులు ధాన్యాన్ని ఎలా భద్రపరచాలో నేర్పారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఇప్పటికీ ఈ "పాత్ర ధాన్యం" పద్ధతి కొనసాగుతూ.. మన ప్రాచీన వ్యవసాయ విజ్ఞానానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

5 / 5
Follow Us