Pillow Washing Tips: ఏంటీ పిల్లోస్ మురికిగా మారాయా? డోంట్ వర్రీ.. ఇలా చేస్తే మెరిసిపోవడం పక్కా!
మీ ఇంట్లోని దిండ్లు పసుపు రంగులోకి మారి మురికిగా కనిపిస్తున్నాయా? వాటిలో రాత్రి నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా. వాటిని పారేయకుండానే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో మళ్ళీ కొత్తవిగా మెరిపించవచ్చు.అలాగే దిండ్లు మళ్ళీ మురికిగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలో, ఎలా శుభ్రం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

ప్రతి ఇంట్లో జనాలు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో దిండ్లు మాసిపోవడం కూడా ఒకటి. గదిలోని దుమ్ము, దూళి, మన తలకు ఉన్న చెమట కారణంగా మన బెడ్‌పై ఉపయోగించే దిండు త్వరగా నల్లబడుతుంది. చాలా మంది దీన్ని క్లీన్ చేసే బదులు కొత్తది కొనాలని ఆలోచిస్తారు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలను ఉపయోగించడం ద్వారా మురికిగా మారిన మీ దిండును క్షణాల్లో కొత్త దానిలా మార్చుకోవచ్చు. ఆ చిట్కాలేంటో తెలుసుకునే ముందు అసలు దిండ్లు ఎందుకు పసుపు రంగులోకి మారుతాయో తెలుసుకుందాం.
దిండ్లు పసుపు రంగులోకి ఎందుకు మారుతాయి?
దిండ్లు క్రమంగా పసుపు రంగులోకి మారడం సర్వసాధారణం. దీని వెనుక ఒకటి కాదు, చాలా కారణాలు ఉన్నాయి. నిద్రలో పట్టే చెమట, శరీరం నుండి విడుదలయ్యే సహజ నూనెలు, మనం వాడే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ (లోషన్లు) లేదా తడి జుట్టుతో పడుకోవడం వంటివి ప్రధాన కారణాలు. ఇవన్నీ దిండు లోపలికి చేరుకుని, గాలితో చర్య జరపడం వల్ల మరకలు ముదురు రంగులోకి మారుతాయి. అందుకే మామూలు వాషింగ్‌తో ఈ మరకలు పోవు. కాబట్టి ఇందుకోసం కొన్ని ప్రత్యేక చిట్కాలు ఉపయోగించాలి.
దిండును కొత్తదానిలా మార్చే చిట్కాలు
బేకింగ్ సోడా, వెనిగర్ సొల్యూషన్: దిండుపై తేలికపాటి పసుపు మరకలు ఉండి, వాసన వస్తుంటే ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకోసం 1/2 కప్పు బేకింగ్ సోడా, కొంచెం నీరు తీసుకోండి. ఈ రెండింటిని కలిపి చిక్కని పేస్టులా తయారు చేయండి. ఈ పేస్టును మరకలు ఉన్న చోట రాయండి.30 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. తర్వాత వాషింగ్ మెషీన్‌లో వేడి నీటితో ఉతకండి. చివరగా మరొకసారి మంచి నీటితో ఉతికితే వాసన లేకుండా పోతుంది.
నిమ్మరసం: మీరు వాడే దిండు చాలా పాతదై, మరీ ఎక్కువగా పసుపు రంగులో ఉంటే నిమ్మరసం, సూర్యరశ్మి కలయిక బాగా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు ఒక చిన్న కప్పు నిమ్మరసంలో అదే కప్పుతో రెండు కప్పుల గోరువెచ్చని నీటిని కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్‌లో పోసి, దిండుపై పసుపు రంగులో ఉన్న చోట స్ప్రే చేయండి. తర్వాత దిండును 2-3 గంటల పాటు ఎండలో ఉంచండి. తర్వాత మామూలుగా ఉతికేయండి. నిమ్మరసంలోని యాసిడ్, సూర్యరశ్మిలోని UV కిరణాలు కలిసి దిండును సహజంగా తెల్లబడేలా చేస్తాయి.
దిండ్లు మళ్ళీ పసుపు రంగులోకి మారకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి
- పిల్లో ప్రొటెక్టర్ వాడండి: ఇది చెమట, నూనెలు దిండు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది.
- ప్రతి 3 నెలలకోసారి ఉతకండి: ఎక్కువ రోజులు మరకలను అలాగే ఉంచకండి.
- పూర్తిగా ఎండబెట్టండి: దిండులో తడి ఉంటే ఫంగస్ చేరి దుర్వాసన వస్తుంది. కాబట్టి ఎండలో బాగా ఆరబెట్టడం ముఖ్యం
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
