AR Rahman : హాట్ టాపిక్ గా రెహమాన్ మాస్క్.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..

 ప్రజల్లో వ్యాక్సినేషన్‌ మీద అవగాహన కల్పించేందుకు సెలబ్రిటీలు కూడా తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ అపోహలకు చెక్ పెడుతున్నారు.

AR Rahman : హాట్ టాపిక్ గా రెహమాన్ మాస్క్.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..
Ar Rahman
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 09, 2021 | 7:15 PM

AR Rahman : ప్రజల్లో వ్యాక్సినేషన్‌ మీద అవగాహన కల్పించేందుకు సెలబ్రిటీలు కూడా తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ అపోహలకు చెక్ పెడుతున్నారు. రీసెంట్‌గా మ్యూజిక్‌ లెజెండ్ ఏఆర్‌ రెహమాన్‌ కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే రెహమాన్ చేసిన పోస్ట్‌ లో అసలు వియషం కన్నా… ఆయన పెట్టుకున్న మాస్కే హాట్ టాపిక్‌గా మారింది. కొడుకుతో కలిసి వ్యాక్సిన్‌ వేయించుకున్న రెహమాన్‌.. మిని ఎయిర్‌ ప్యూరిఫైర్ మాస్క్‌ను పెట్టుకొని కనిపించారు. ఆ మాస్క్ డిఫరెంట్‌గా ఉండటంతో దాని గురించి సెర్చింగ్ మొదలు పెట్టారు నెటిజెన్స్‌. రెహమాన్ రేంజ్‌ సెలబ్రిటీ పెట్టుకున్నాడంటే దాని కాస్ట్ మరో లెవల్‌లోనే ఉంటుందనుకుంటున్నారా..? యస్‌ మీ గెస్ కరెక్టే.. ఆ మాస్క్ కాస్ట్ దాదాపు 12 వేలు.

ఢిల్లీ లాంటి సిటీస్‌లో ఈ మాస్కులను చాలా కాలంగా వాడుతున్నారు. బట్‌ రెహమాన్‌ అలాంటి మాస్క్‌తో కనిపించటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇవే కాదు సెలబ్రిటీస్ యూజ్ చేస్తున్న ఫేస్‌ షీల్డ్‌లు… డిజైనర్‌ మాస్క్‌లు కూడా ఈ మధ్య తెగ వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by ARR (@arrahman)

మరిన్ని ఇక్కడ చదవండి :

Jagapathi Babu : బాలీవుడ్ కు పాకిన జగపతి బాబు విలనిజం.. స్టార్ హీరో సినిమాలో ప్రతినాయకుడిగా..

Naga Chaitanya : అక్కినేని యంగ్ హీరో బాలీవుడ్ డెబ్యూ మూవీ వాయిదా పడింది.. కారణం ఇదే..

Manchu Vishnu: త‌న 4am ఫ్రెండ్ ఎవరో రివీల్ చేసిన మంచు విష్ణు.. అత‌ను కూడా టాలీవుడ్ హీరోనే అండోయ్