AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pandu Master: పండు మాస్టర్‌కు ఏపీ మంత్రి ఆర్థిక సాయం..హెల్డ్ అప్డేట్ ఏంటంటే?

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఢీ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ ను ఆదుకునేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే గుడివాడ అమర్నాథ్, పల్లాశ్రీనివాసరావు పండు మాస్టర్ ను పరామర్శించి తమ వంతు సాయం అందజేశారు. తాజాగా ఏపీ మంత్రి పండు మాస్టర్ కు అండగా నిలిచారు.

Pandu Master: పండు మాస్టర్‌కు ఏపీ మంత్రి ఆర్థిక సాయం..హెల్డ్ అప్డేట్ ఏంటంటే?
Pandu Master
Basha Shek
|

Updated on: Jun 07, 2026 | 2:07 PM

Share

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, ‘ఢీ’ ఫేమ్ పండు మాస్టర్‌ (జి. షణ్ముఖ) ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను విశాఖపట్నంలోని మెడి కవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పండు మాస్టర్ కు యాక్సిడెంట్ అయ్యిందన్న విషయం తెలియగానే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మెడికవర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ పండు మాస్టర్ ను పరామర్శంచి ధైర్యం చెప్పారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఫోన్ ద్వారా పండు మాస్టర్‌తో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకుని మళ్లీ సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించాడు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ తరఫున ఆయన తండ్రి, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సత్యం మెడికవర్ ఆసుపత్రికి వెళ్లి పండు మాస్టర్‌ను పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ క్రమంలోన సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ తరఫున రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని పండు మాస్టర్ కు అందజేశారు.అలాగే వైద్యులతో మాట్లాడి పండు మాస్టర్ కు అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని సూచించారు. అంతకు ముందు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పల్లా శ్రీనివాసరావు పండు మాస్టర్ ను పరామర్శించి తమ వంతు సాయం అందజేశారు.

సర్జరీ విజయవంతం

కాగా రోడ్డు ప్రమాదంలో పండు మాస్టర్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో డాక్టర్లు సర్జరీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఒక ప్రత్యేక వైద్య బృందం పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. సర్జరీ సక్సెస్ అయినప్పటికీ పండు మాస్టర్ కు పూర్తిగా రెస్ట్ అవసరమని మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని, వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలోనే ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని పలువురు బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us