Minister Roja: నటుడు మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై మంత్రి రోజా ఫైర్‌..’ఇలాంటి వాళ్లపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలి’

|

Nov 20, 2023 | 11:31 AM

దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిషపై ప్రముఖ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ‘లియో’ సినిమాలో త్రిష, విజయ్‌ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజైన ఈ మువీ సూపర్‌ హిట్‌ టాక్‌ అందుకుంది. అయితే ఈ మువీలో నటుడు మన్సూర్ అలీ ఖాన్‌ కూడా నటించిన సంగతి తెలిసిందే. అతను ఇటీవల మీడియాతో మాట్లాడుతూ నటి త్రిషపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. 'లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటించా. ఈ సినిమాలో..

Minister Roja: నటుడు మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై మంత్రి రోజా ఫైర్‌..ఇలాంటి వాళ్లపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలి
Minister Roja Selvamani Fires On Mansoor Ali Khan
Follow us on

దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిషపై ప్రముఖ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ‘లియో’ సినిమాలో త్రిష, విజయ్‌ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజైన ఈ మువీ సూపర్‌ హిట్‌ టాక్‌ అందుకుంది. అయితే ఈ మువీలో నటుడు మన్సూర్ అలీ ఖాన్‌ కూడా నటించిన సంగతి తెలిసిందే. అతను ఇటీవల మీడియాతో మాట్లాడుతూ నటి త్రిషపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ‘లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటించా. ఈ సినిమాలో ఒక్క బెడ్‌ రూం సీనైనా ఉంటుందని అనుకున్నా. గతంలో ఖుష్బూ, రోజా లాంటి హీరోయిన్లతో రేప్ సీన్లలో నటించాను. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తనకు ‘లియో’ కథ చెప్పినప్పుడు త్రిషతో కూడా ఒక రేప్ సీన్ ఉంటుందని భావించా. కానీ కశ్మీర్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం నాకు చూపించలేదని’ అంటూ మన్సూర్ అలీ ఖాన్ కామెంట్‌ చేశాడు. అన్నారు. అతని వ్యాఖ్యలపై లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ అతని వ్యాఖ్యలపై మండిపడ్డారు. కోలీవుడ్‌ తారలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగర్ చిన్మయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇలాంటి వారికి సినిమాల్లో ఎందుకు అవకాశాలిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై తాజాగా త్రిష స్పందించారు. మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో నేను చూశాను. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఒక స్త్రీని అగౌరవంగా, ద్వేషపూరితంగా మాట్లాడినట్లు అనిపిస్తోందన్నారు. మరోసారి మన్సూర్ అలీ ఖాన్‌తో కలిసి తాను నటించబోనని త్రిష పేర్కొన్నారు. నా మిగిలిన సినిమా కెరీర్‌లో కూడా ఇలా జరగకుండా చూసుకుంటానన్నారు. అతని లాంటి వారి వల్ల మనుషులందరికీ చెడ్డపేరు వస్తుందన్నారు. ఇక ఈ వివాదంపై త్రిషకు తమిళ ఇండస్ట్రీ నుంచి మద్దతు లభిస్తోంది. మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ తమిళ సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా దీనిపై స్పందిస్తున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కూడా దీనిపై స్పందించారు. మన్సూర్ అలీ ఖాన్ లాంటి మగాళ్ల మాట్లాడే పద్ధతి మారాలంటే వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పదని ఆమె అభిప్రాయపడ్డారు. వాళ్లు నాపై దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే త్రిష, ఖుష్బూ, నాపై వ్యాఖ్యలు చేసిన మన్సూర్ అలీ ఖాన్ లాంటి వాళ్లు కావచ్చు. కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోని పక్షంలో ఈ మగాళ్లు ఇలాగే భయపడకుండా నోటికి వచ్చినట్లు ఏదైనా మాట్లాడతారు. ఆడవారిని ఈ విధంగా టార్గెట్ చేసినా.. రాజకీయాలు, సినిమాల్లో ఎదిగి చూపించాం. ఇలాంటి మగాళ్లను ఇతర మహిళలు కలిస్తే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ అని మంత్రి రోజా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

మన్సూర్ అలీ ఖాన్ క్లారిఫికేషన్

నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలపై మన్సూర్ అలీ ఖాన్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతకన్నా ఈ ప్రపంచంలో ముఖ్యమైన అంశాలు ఎన్నో ఉన్నాయని, ప్రస్తుతం స్పందిస్తోన్న పెద్దవాళ్లంతా వాటిపై మాట్లాడాలని సూచించాడు. మహిళలంటే తనకు ఎంతో గౌరవమని, తాను ఏనాడూ తనతో నటించిన ఏ నటిని అవమానించలేదన్నాడు.

నటి త్రిష కృష్ణన్‌ను మెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానన్నాడు. తన గురించి తమిళనాడు ప్రజలకు తెలుసని, తాను చేసే మంచి పనులు గురించి ఎవరిని అడిగినా చెబుతారన్నాడు. సరదాగా చెప్పిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందనుకోలేదన్నాడు. తనను టార్గెట్‌ చేస్తూ ఎలాంటి వివాదాన్ని లేవనెత్తినా తాను భయపడబోనని స్పష్టం చేశాడు.

మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.