- Telugu News Photo Gallery Cinema photos Payal Rajput to Varalakshmi Sarathkumar latest news from film industry
Movie News: మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్నానన్న పాయల్.. భలే పాత్ర చేశారని మెచ్చుకుంటే చాలని వరలక్ష్మి..
రణ్‌బీర్‌కపూర్, రష్మిక జంటగా నటించిన సినిమా యానిమల్. నయనతార పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియాలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు ఆమె భర్త విఘ్నేష్ శివన్. కంగనా రనౌత్ సెట్స్ కి వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చారు సూపర్‌స్టార్ రజనీకాంత్. సరైన విజయం కోసం మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నానని అన్నారు నటి పాయల్ రాజ్‌పుత్. తెలుగులో తొలి సారి పోలీస్ కేరక్టర్ చేశానని అన్నారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Nov 20, 2023 | 11:11 AM

రణ్‌బీర్‌కపూర్, రష్మిక జంటగా నటించిన సినిమా యానిమల్. డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి అర్జన్ వైలీ అనే పాటను విడుదల చేశారు. హీరో రోల్‌కి సంబంధించిన జర్నీని ఈ పాటలో చూపించామని అన్నారు మేకర్స్.

నయనతార పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియాలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు ఆమె భర్త విఘ్నేష్ శివన్. భార్యా పిల్లలతో తీసుకున్న ఓ ఫొటోను ఆయన అభిమానులతో పంచుకున్నారు. పెళ్లయ్యాక, తల్లయ్యాక నయనతారలో చాలా మార్పు వచ్చిందని అంటున్నారు నెటిజన్లు.

కంగనా రనౌత్ సెట్స్ కి వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆర్. మాధవన్, కంగనా కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇండియన్ సినిమా దేవుడిగా భావించే రజనీకాంత్ తమ సెట్‌కి వచ్చారని ఆనందాన్ని పంచుకున్నారు కంగన.

సరైన విజయం కోసం మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నానని అన్నారు నటి పాయల్ రాజ్‌పుత్. మంగళవారం సక్సెస్ మీట్‌లో భావోద్వేగానికి గురయ్యారు పాయల్. సంతోషంతో మాటలు రావడం లేదని, భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలతో మెప్పిస్తాననీ అన్నారు.

తెలుగులో తొలి సారి పోలీస్ కేరక్టర్ చేశానని అన్నారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. ఆమె నటించిన కోటబొమ్మాళి పీయస్ ఈ నెల 24న విడుదల కానుంది. సినిమా చూసిన ప్రేక్షకులు భలే పాత్ర చేశారని మెచ్చుకుంటే చాలని అన్నారు వరలక్ష్మి.





























