ప‌వ‌న్ తో స్క్రీన్ పంచుకోబోతున్న అనుష్క‌..!

ప‌వ‌న్ తో స్క్రీన్ పంచుకోబోతున్న అనుష్క‌..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నారు. రాజకీయాలు, సినిమాల‌తో రెండు ‌ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తోన్న ఆయ‌న ప్ర‌స్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ మూవీ చేస్తున్నారు. ఈ మూవీతో పాటు క్రిష్ డైరెక్ష‌న్ లో పవన్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది. కాగా ప‌వన్ కళ్యాణ్‌తో ‘ఖుషి’ వంటి సూప‌ర్ హిట్ […]

Ram Naramaneni

|

May 04, 2020 | 11:04 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నారు. రాజకీయాలు, సినిమాల‌తో రెండు ‌ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తోన్న ఆయ‌న ప్ర‌స్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ మూవీ చేస్తున్నారు. ఈ మూవీతో పాటు క్రిష్ డైరెక్ష‌న్ లో పవన్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది. కాగా ప‌వన్ కళ్యాణ్‌తో ‘ఖుషి’ వంటి సూప‌ర్ హిట్ మూవీ తీసిన ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం తన శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని కమర్షియల్ హంగులతో క్రిష్ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్టు టాలీవుడ్ లో ప్ర‌చారం జరుగుతోంది. అయితే, ఈ మూవీలో రాజకుటుంబానికి చెందిన మహిళ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను తీసుకున్నారని న్యూస్ వినిపించాయి. ఈ న్యూస్ పై సస్పెన్స్ న‌డుస్తుండ‌గానే మ‌రో వార్త తెరపైకి వ‌చ్చింది.

ఇప్పుడు పవన్ సరసన నటించే హీరోయిన్ పాత్ర కోసం అనుష్కను తీసుకున్నట్టు టాక్. ఇప్పటికే ఆమెను క్రిష్ సంప్రదింపులు జ‌రిపార‌ట‌. వీడియో కాల్ ద్వారా ఆమెకు క‌థ‌ వినిపించారని.. అది నచ్చడంతో అనుష్క గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని అంటున్నారు. దీనిపై త్వరలోనే అపిషియ‌ల్ ప్రకటన వెలువడుతుందని స‌మాచారం.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu