5

మందు కోసం క్యూలో నిలబడ్డ లేడీస్‌పై వర్మ కామెంట్స్.. సాలిడ్ కౌంటర్ ఇచ్చిన సింగర్!

వైన్‌ షాపుల ముందు.. మందు కోసం క్యూలో నిలబడ్డ లేడీస్‌పై డైరెక్టర్ వర్మ కీలక కామెంట్స్ చేశారు. తాజాగా వైన్‌షాపు క్యూలో నిలబడ్డ ఆడవాళ్లపై తన ట్విట్టర్‌లో వర్మ చేసిన ట్విట్ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌కి ఓ బాలీవుడ్ సింగర్ అదిరిపోయే..

మందు కోసం క్యూలో నిలబడ్డ లేడీస్‌పై వర్మ కామెంట్స్.. సాలిడ్ కౌంటర్ ఇచ్చిన సింగర్!
Follow us

| Edited By:

Updated on: May 04, 2020 | 10:41 PM

వైన్‌ షాపుల ముందు.. మందు కోసం క్యూలో నిలబడ్డ లేడీస్‌పై డైరెక్టర్ వర్మ కీలక కామెంట్స్ చేశారు. తాజాగా వైన్‌షాపు క్యూలో నిలబడ్డ ఆడవాళ్లపై తన ట్విట్టర్‌లో వర్మ చేసిన ట్విట్ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌కి ఓ బాలీవుడ్ సింగర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇక ఈ ట్వీట్స్ కాస్తా  మరింత వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆ ట్వీట్స్‌పై సోషల్ మీడియాలో మరింత చర్చ జరుగుతోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇన్ని రోజులుగా మూతపడ్డ లిక్కర్ షాపులు తెరుచుకున్నాయి. దీంతో మందు కోసం మగవారితో పాటు ఆడవాళ్లు కూడా క్యూ లైన్లలో నిలుచున్నారు. కాగా ఈ ఫొటో కాస్తా ఆర్జీవీ దృష్టికి రావడంతో.. ఆ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ‘చూడండి మద్యం షాపుల వద్ద ఎవరు క్యూలో ఉన్నారో. అవును పాపం, తాగే పురుషుల నుంచి మహిళలను రక్షించడం చాలా ముఖ్యం’.. అంటూ ఓ వెటకారపు ట్వీట్ చేశారు.

అయితే రామ్ గోపాల్ వర్మ ట్వీట్‌పై బాలీవుడ్ సింగర్ సోనా మెహపాత్ర స్పందించారు. ‘డియర్ మిస్టర్ ఆర్జీవీ, పురుషుల మాదిరిగానే.. మహిళలకు కూడా మద్యం కొనుక్కుని, సేవించే హక్కు ఉంది. అయితే మందు తాగాక హింసాత్మకంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. మీ ట్వీట్ సెక్సిజం, నైతికత రీక్స్ అర్థానికి వీలుగా ఉందంటూ’ కాస్త ఘాటుగా సమాధానమిచ్చారు సింగర్ సోనా మెహపాత్ర.

Read More:

షాపుల ముందు మందు బాబుల క్యూ లైన్‌ చూసి షాక్‌ అయిన చంద్రబాబు!

పేగులపై కరోనా వైరస్ దాడి.. మళ్లీ ఇదో కొత్త టెన్షన్!

నేనూ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా: ఆయుష్మాన్