Gold Price: గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?
భారతీయుడి జీవితంలో ఏ వేడుకైనా బంగారంతోనే ముడిపడి ఉంటుంది. ధరలు ఆకాశాన్ని తాకినా, పాతాళానికి పడిపోయినా పసిడిపై సగటు భారతీయుడికి ఉన్న సెంటిమెంట్, నమ్మకం ఎప్పటికీ చెరగనివి. ఆపద సమయాల్లో ఆదుకునే ఆస్తిగా భావించే ఈ పసిడి ధరలు.. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుంటూ స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ్లి ధరలు ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భారతీయులకు బంగారం అనేది కేవలం ఒక విలువైన లోహం మాత్రమే కాదు, అదొక బలమైన సెంటిమెంట్, ఆపద సమయాల్లో ఆదుకునే నమ్మకమైన ఆర్థిక ఆయుధం. మన దేశంలో శుభకార్యాలు, పండగలు వచ్చాయంటే చాలు.. మార్కెట్‌లో ధరలతో సంబంధం లేకుండా పసిడి కొనుగోళ్లు జోరుగా జరుగుతాయి. ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలో నిన్నటితో పోలిస్తే దేశీయ మార్కెట్‌లో బంగారం ధరల్లో పెద్దగా మార్పులు లేవు. నిన్నటి ధరలతో పోలిస్తే కేవలం తులం బంగారం రూ.10 మాత్రమే తగ్గింది. దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,41,320గా ఉంది. ఇది నిన్న రూ.1,41,330గా ఉన్నది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.1,29,540 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ధర నిన్న 1,29,550గా ఉంది. అదేవిధంగా 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 1,05,990 గా ఉంది. గురువారం బంగారం భారీగా తగ్గింది. 24 క్యారెట్లపై రూ.1580, 22 క్యారెట్లపై రూ.1450 చొప్పున భారీగా తగ్గిన పసిడి ధరలు, ఈరోజు మాత్రం కేవలం రూ.10 స్వల్ప తగ్గుదలతో స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి.
వివిధ నగరాల్లో ఇలా
దేశంలోని ప్రముఖ నగరాల విషయానికి వస్తే.. ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో బంగారం ధరలు ఒకేలా సాగుతున్నాయి. ఈ నగరాల్లో 24 క్యారెట్ల ధర రూ.1,41,320 గాను, 22 క్యారెట్ల ధర రూ.1,29,540 గాను ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,41,470 ఉండగా.. 22 క్యారెట్ల రూ.1,29,690గా ఉంది. ఇక ఎప్పుడూ డిమాండ్ ఎక్కువగా ఉండే చెన్నై నగరంలో మిగిలిన అన్ని నగరాల కంటే అత్యధికంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,340 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,31,390 గా నమోదైంది.
వెండి ధరలు ఇలా..
అటు వెండి ధరలు స్వల్ప తగ్గుదలతో కొనసాగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే కేజీ వెండిపై రూ.100 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలతో పాటు ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులలో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 2,34,900 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే చెన్నై నగరంలో మాత్రం మిగిలిన నగరాల కంటే వెండి ధర కాస్త తక్కువగా నమోదైంది. చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,29,900 గా ఉంది.
కాగా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం ధరలు ఎంత పెరిగినా, తగ్గినా సగటు భారతీయుడికి దీనిపై ఉన్న మక్కువ, సెంటిమెంట్ అస్సలు తగ్గవని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. షేర్ మార్కెట్లు లేదా ఇతర డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్ల కంటే ఇప్పటికీ సురక్షితమైన, నమ్మకమైన పెట్టుబడిగా సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు అందరూ బంగారానికే తొలి ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో ధరలు భారీగా పెరగకుండా ఇలా స్థిరంగా కొనసాగడం సామాన్య కుటుంబాలకు పెద్ద రిలీఫ్ కలిగించే విషయమనే చెప్పాలి.
