Anushka Shetty: ఆ స్టార్ హీరోయిన్ అందానికి ఫిదా అయిన అనుష్క.. అలా చూస్తూ ఉండిపోయింది
తొలి సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. ఆతర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంది. సూపర్ సినిమాతో అనుష్కకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ వెంటనే.. సుమంత్ తో కలిసి మహానంది అనే సినిమా చేసింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది అందాల భామ అనుష్క. ఈ చిన్నది ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించింది. సూపర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన అనుష్క.. తొలి సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. ఆతర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంది. సూపర్ సినిమాతో అనుష్కకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ వెంటనే.. సుమంత్ తో కలిసి మహానంది అనే సినిమా చేసింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత రాజమౌళి దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు సినిమాలో ఛాన్స్ అందుకుంది. విక్రమార్కుడు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విక్రమార్కుడు సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో అనుష్క పేరు మారుమ్రోగింది. దాంతో అనుష్క బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ఆకట్టుకుంది.
ఇది కూడా చదవండి : Suriya: సూర్య ఫస్ట్ క్రష్ ఆ హీరోయినా..! జ్యోతిక మాత్రం కాదు
కమర్షియల్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే అరుంధతి సినిమాతో ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాంతో అనుష్కకు స్టార్ హీరోయిన్ క్రేజ్ వచ్చింది. వరుసగా బడా హీరోల సరసన నటించింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ వరుసగా సినిమాలు చేసింది ఈ అందాల భామ. ఇక బాహుబలి సినిమాతో అనుష్క పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది.
ఇది కూడా చదవండి : దేశం విడిచి పారిపోయిన నటి.. డబ్బులు లేక బిచ్చగత్తెలా బ్రతుకుతున్నా అంటూ..
రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ చిన్నది ఆచి తూచి సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే అనుష్క ఓ హీరోయిన్ అందానికి ఫిదా అయ్యింది. ఆమె అందం, అభినయం చూస్తూ మైమర్చిపోయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు అలనాటి అందాల తార సౌందర్య. అనుష్క గతంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సౌందర్యలహరి అనే కార్యక్రమానికి గెస్ట్ గా హాజరయ్యింది. ఆ షో లో రాఘవేంద్రరావు దర్శకత్వం గురించి ఆయన స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే సౌందర్య సాంగ్ ను ప్లే చేశారు. ఆ సాంగ్ లో సౌందర్య అందానికి అనుష్క ఫిదా అయ్యింది. అలా సౌందర్యను చూస్తూ ఉండిపోయింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








