AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anni Manchi Sakunamule: చిన్న సినిమాకు భారీ బిజినెస్.. డైరెక్టర్ నందినికి అన్నీ మంచి శకునాలే

తన సినిమాను చేసేందుకు ఒప్పుకోవడమే కాదు.. ఈ సినిమా ప్రమోషన్‌కు కూడా టాలీవుడ్ యంగ్ హీరోలు కలిసి నడవడం! నిజంగా.. ఈ సినిమాకు.. ఈ సినిమా డైరెక్టర్ అయిన నందినీ రెడ్డికి మంచి శకునాలే!

Anni Manchi Sakunamule: చిన్న సినిమాకు భారీ బిజినెస్.. డైరెక్టర్ నందినికి అన్నీ మంచి శకునాలే
Anni Manchi Sakunamule
Rajeev Rayala
|

Updated on: May 20, 2023 | 9:55 AM

Share

తను డైరెక్టర్ చేసిన సినిమా పేరుకు తగ్గట్టే.. డైరెక్టర్ నందినికి అన్నీ మంచి శకునాలే ఎదురవుతున్నాయి. టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద మంచి ప్రొడక్షన్ కంపెనీ, తన సినిమాను చేసేందుకు ఒప్పుకోవడమే కాదు.. ఈ సినిమా ప్రమోషన్‌కు కూడా టాలీవుడ్ యంగ్ హీరోలు కలిసి నడవడం! నిజంగా.. ఈ సినిమాకు.. ఈ సినిమా డైరెక్టర్ అయిన నందినీ రెడ్డికి మంచి శకునాలే!

ఇక ఈ శకునాల సంగతి పక్కుకు పెడితే.. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పుడు పెద్ద సక్సెస్ కొట్టేలా.. కలెక్షన్స్ సునామీ సృష్టించేదిగా కనిపిస్తోంది. ఇప్పటకే ఈ మూవీ 21.5 కోట్లు రాబట్టిందనే టాక్ ఇండస్ట్రీ నుంచి కాస్త గట్టిగానే బయటికి వస్తోంది.

ఎస్ ! స్వప్న సినిమాస్‌ ప్రొడక్షన్స్ లో.. శోభన్ హీరోగా చేసిన ఈ సినిమా.. నాన్ థియేటర్ రూపంలో దాదాపు 21.5 కోట్ల వరకు బిజినెస్ చేసిందట. అయితే ఇంత చిన్న సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ జరగడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఇక నిన్న (శుక్రవారం ) విడుదలైన ఈ సినిమాకు మం చి టాక్ వస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్ వస్తోంది.