Tripti Dimri: ‘జీవితం నాశనమవుతుంది.. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరు రారని అన్నారు’.. హీరోయిన్ త్రిప్తి డిమ్రి..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని.. నటిగా మారాలనుకున్నప్పుడు ఇంట్లో వాళ్లు ప్రోత్సహించినప్పటికీ చుట్టుపక్కలవాళ్లు, బంధువులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ తన తల్లిదండ్రులను భయపెట్టారని అన్నారు.
పాన్ ఇండియా లెవల్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో త్రిప్తి డిమ్రి ఒకరు. ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టి దశాబ్దం కావొస్తున్నా… ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. గతేడాది విడుదలైన యానిమల్ సినిమాతో త్రిప్తి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీతో నేషనల్ క్రష్ అనే ట్యాగ్ సంపాదించుకున్న త్రిప్తి.. ఇప్పుడు బాలీవుడ్ బ్యాక్ టూ బ్యా్క్ చిత్రాలతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని.. నటిగా మారాలనుకున్నప్పుడు ఇంట్లో వాళ్లు ప్రోత్సహించినప్పటికీ చుట్టుపక్కలవాళ్లు, బంధువులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ తన తల్లిదండ్రులను భయపెట్టారని అన్నారు.
“మాది ఉత్తరాఖండ్. కానీ పుట్టి పెరిగింది ఢిల్లీలో. ఫ్యామిలీ మొత్తం అక్కడే సెటిల్ అయ్యింది. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే నటిని కావాలనుకున్నాడు. ఇంట్లో వాళ్లకు చెప్పగానే కాస్త కంగారుపడ్డారు. ధైర్యం చేసి ముంబాయి వచ్చాను. ఆ సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. ఒకే గదిలో సుమారు 50 మంది ఉండేవాళ్లం. ప్రతిరోజూ పనికోసం అనేక ప్రయత్నాలు చేసేదాన్ని. చేతిలో అవకాశాల్లేక బాధపడిన క్షణాలూ ఉన్నయా. కొన్ని సందర్భాల్లో నమ్మకం కూడా కోల్పోయా.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకోవాలని నిర్ణయించుకున్నాను.. కానీ ఇంటికి తిరిగి వెళ్లొద్దు అనుకున్నాను. చివరకు లైలా మజ్ను సినిమాలో అవకాశం వచ్చింది. తొలి చిత్రంతోనే మంచి రెస్పాన్స్ వచ్చింది” అంటూ చెప్పుకొచ్చింది.
“కానీ నేను ముంబాయికి వచ్చిన సమయంలో చాలా మంది నా గురించి నా తల్లిదండ్రులకు చెడుగా చెప్పారు. మీ అమ్మాయిని ఎందుకు పంపించావు.. సినిమా ప్రపంచం మంచిది కాదు.. ఆమె చెడు అలవాట్లకు బానిస అవుతుంది. పెళ్లి చేసుకోదు.. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు అని చెప్పాడు. మొదట్లో నా ఫ్యామీలి భయపడింది. కానీ లైలా మజ్ను సినిమా తర్వాత సంతోషించారు. ” అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన త్రిప్తికి యానిమల్ సినిమాతో క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె రాజ్‌కుమార్ రావు ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’లో నటిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 11 న విడుదల కానుంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఇంకా టైటిల్ నిర్ణయించని చిత్రంలో ఆమె షాహిద్ కపూర్‌తో కలిసి స్క్రీన్‌ను పంచుకుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.