Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishnu Priya: బెట్టింగ్ యాప్ కేసు.. పంజాగుట్ట పోలీసుల ముందు విష్ణుప్రియ

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేసి, యూత్‌ ఎమోషన్స్‌తో ఆడుకుని, వాళ్ల జీవితాలు నాశనం అయ్యేలా చేస్తున్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల భరతం పడుతున్నారు పోలీసులు. అందులోభాగంగానే...యూట్యూబర్లు విష్ణుప్రియ, టేస్టీ తేజను మంగళవారం విచారణకు పిలిచారు. షూటింగ్‌లో ఉన్నాం... మీడియా ఉందన్న సాకుతో వాళ్లు విచారణకు డుమ్మా కొట్టారు.

Vishnu Priya: బెట్టింగ్ యాప్ కేసు.. పంజాగుట్ట పోలీసుల ముందు విష్ణుప్రియ
Vishnu Priya
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 20, 2025 | 12:07 PM

బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ కేసులో యాంకర్‌ విష్ణుప్రియకు ఇటీవల నోటీసులు జారీ చేశారు పంజాగుట్ట పోలీసులు. ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసుల్లో ఆదేశించారు. అయితే ఆ రోజు షూటింగ్‌ కారణంగా విచారణకు హాజరుకాలేదు విష్ణుప్రియ. పోలీసుల అనుమతితో ఈ రోజు విచారణకు హజరయ్యారు. బెట్టింగ్‌ యాప్స్‌ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే విష్ణు ప్రియకు కూడా నోటీసులు ఇచ్చారు. దాంతో ఆమె  పోలీసుల ముందు హాజరైంది. అడ్వొకేట్‌తో సహా పోలీసుల విచారణకు వచ్చింది విష్ణుప్రియ.

ఇక సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను వరుసగావిషరిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే టేస్టీ తేజా.. కానిస్టేబుల్‌ కిరణ్‌ను  పోలీసులు విచారించారు. అలాగే నటి శ్యామల, రీతూ చౌదరి, అజయ్‌, సుప్రీత, సన్నీ సుధీర్‌, అజయ్‌ సన్నీలకు పోలీసుల నోటీసులు ఇచ్చారు. ఇప్పటివరకు బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్‌పై.. మొత్తం 11మందిపై కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు.  నోటీసులు అందుకున్న వారిలో పలువురి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయని తెలుస్తుంది. వినయ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. త్వరలో మరికొంతమందికి నోటీసులు జారీ చేయనున్నారు.

ఇదిలా ఉంటే మియాపూర్ పోలీసులు టాప్ సెలబ్రెటీల పై కేసు నమోదు చేశారు. అగ్ర నటులు, హీరోయిన్లతో సహా 25మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. రానా దగ్గుబాటి, ప్రకాష్‌రాజ్‌, మంచు లక్ష్మి, హీరోయిన్లు, ప్రణీత, నిధి అగర్వాల్‌, అనన్య నాగళ్ల, యాంకర్లు శ్రీముఖి, వర్షిణి, సిరి హన్మంత్‌పై మియాపూర్‌ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. వీరితోపాటు.. శోభాశెట్టి, అమృత చౌదరి, నాయని పావని, పండు, నేహా పఠాన్‌, పద్మావతి, ఇమ్రాన్‌ ఖాన్‌, హర్షసాయి, బయ్యా సన్నీయాదవ్‌, శ్యామల, విష్ణుప్రియ, టేస్టీ తేజ, రీతూ చౌదరిపై కేసు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
కాసులకు కక్కుర్తిపడితే ఊచలు తప్పవు..బెట్టింగ్ బంగార్రాజులకు షాక్
కాసులకు కక్కుర్తిపడితే ఊచలు తప్పవు..బెట్టింగ్ బంగార్రాజులకు షాక్
38 గంటలు కదలకుండా నిలబడ్డ యూట్యూబర్.. బుగ్గ గిల్లినా వీడియో
38 గంటలు కదలకుండా నిలబడ్డ యూట్యూబర్.. బుగ్గ గిల్లినా వీడియో