Reethu Chowdary: నేను కూడా రేవ్ పార్టీకి వెళ్లాలనుకున్నాను.. నన్నెప్పుడు పిలుస్తారా అని చూశాను.. రీతూ చౌదరి కామెంట్స్..
రీతూ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. అందుకు కారణం కొన్ని రోజులుగా నెట్టింట తెగ వినిపిస్తున్న రేవ్ పార్టీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడమే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రీతూ మాట్లాడుతూ తనకు చాలా రోజులుగా రేవ్ పార్టీకి వెళ్లాలని ఉందని.. ఎప్పుడూ పిలుస్తారా అని వెయిట్ చేసినట్లు తెలిపింది. కానీ ఇప్పుడు రేవ్ పార్టీ అంటే ఏంటో తెలిసాక వెళ్లకపోవడమే బెటర్ అంటూ చెప్పుకొచ్చింది.
బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు రీతూ చౌదరి. జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలా ఫేమస్ అయ్యింది. ఆ షో నుంచి బయటకు వచ్చిన రీతూ.. ఇప్పుడు యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ షోస్ చేస్తూ ఫోటోస్ షేర్ చేస్తుంది. నెట్టింట చాలా యాక్టింగ్గా రీల్స్ షేర్ చేస్తుంటుంది. కొన్నాళ్లుగా యాంకరింగ్ చేస్తూ రియాల్టీ షోస్, సినిమాలకు దూరంగా ఉంటున్న రీతూ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. అందుకు కారణం కొన్ని రోజులుగా నెట్టింట తెగ వినిపిస్తున్న రేవ్ పార్టీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడమే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రీతూ మాట్లాడుతూ తనకు చాలా రోజులుగా రేవ్ పార్టీకి వెళ్లాలని ఉందని.. ఎప్పుడూ పిలుస్తారా అని వెయిట్ చేసినట్లు తెలిపింది. కానీ ఇప్పుడు రేవ్ పార్టీ అంటే ఏంటో తెలిసాక వెళ్లకపోవడమే బెటర్ అంటూ చెప్పుకొచ్చింది.
ఇటీవల బెంగుళూరు రేవ్ పార్టీలో ఎక్కువగా తెలుగువారి పేర్లు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పార్టీకి హాజరైన వారందరి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేయగా.. దాదాపు 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిసింది. వారందరికీ ఇప్పటికీ నోటీసులు జారీ చేశారు బెంగుళూరు పోలీసులు. కొన్ని రోజులుగా బెంగుళూరు రేవ్ పార్టీ, నటి హేమ, వాసు అంటూ చాలా మంది పేర్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. తాజాగా రేవ్ పార్టీ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తలలో నిలిచింది రీతూ చౌదరి.
“రేవ్ పార్టీ అంటే నాకు తెలియదు. అక్కడ ఏం చేస్తారనేది తెలియదు. అందుకే రేవ్ పార్టీకి వెళ్లాలని అనుకున్నాను. ఆ పార్టీకి నన్నెప్పుడూ పిలుస్తారా అని వెయిట్ చేశాను. రేవ్ పార్టీ అంటే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను. కానీ ఇప్పుడు రేవ్ పార్టీకి సంబంధించిన కొన్ని విషయాలను, డ్రగ్స్ అంటూ విన్న తర్వాత ఇలా ఉంటుందా.. వెళ్లకపోవడమే బెటర్ అనుకున్నాను. వాటికి దూరంగా ఉంటే అంత మంచిదని అర్థం అయ్యింది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రీతూ చౌదరీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.