Rangastalam Movie: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆది ప్రేయసి.. రంగస్థలం సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ గుర్తుందా..?
సమంత కథానాయికగా నటించగా.. హీరో ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, అనసూయ కీలకపాత్రలు పోషించారు. 2018 మార్చి 30న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్త్ంగా రూ.210 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో చిట్టిబాబు పాత్రలో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు రామ్ చరణ్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమా రంగస్థలం. డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 1980ల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వై రవి శంకర్, సివి మోహన్ నిర్మించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇందులో సమంత కథానాయికగా నటించగా.. హీరో ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, అనసూయ కీలకపాత్రలు పోషించారు. 2018 మార్చి 30న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్త్ంగా రూ.210 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో చిట్టిబాబు పాత్రలో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు రామ్ చరణ్. ఇక సమంత, అనసూయ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో రంగమ్మాత్త పాత్రలో కనిపించి మరింత పాపులర్ అయ్యింది అనసూయ.
ఇదిలా ఉంటే.. ఇదే సినిమాలో ఆది పినిశెట్టి ప్రేయసిగా ఓ అమ్మాయి కనిపించింది. మూవీలో ఆ బ్యూటీ కనిపించిన సమయం తక్కువే కానీ.. ఆమె ప్రేమకథ వల్లే చిట్టిబాబు కథ మలుపు తిరుగుతుంది. చిట్టిబాబు అన్న ఆది పినిశెట్టిని ఆ అమ్మాయిని ప్రేమించడం.. దీంతో ఆమె తండ్రి ప్రకాష్ రాజ్ ఆదిని హత్య చేయిస్తాడు. రంగస్థలం సినిమాలో కథను మలుపు తిప్పే ఆది పినిశెట్టి ప్రేయసిగా కనిపించిన ఆ అమ్మాయి పేరు పూజిత పొన్నాడ.
రంగస్థలం సినిమా హిట్ కావడంతో తెలుగులో ఈ బ్యూటీకి మంచి ఆఫర్స్ వచ్చాయి. వేర్ ఈజ్ వెంకటలక్ష్మి, బ్రాండ్ బాబు, సెవెన్ చిత్రాల్లో నటించింది. అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ చేసింది. విశాఖపట్నంకు చెందిన పూజిత.. ఇంజనీరింగ్ పూర్తి చేసి టాటా కన్సల్టెన్సీలో ఉద్యోగం చేసింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2016వలో తుంటరి సినిమాతో వెండితెరకు పరిచయమైంది. కొన్నాళ్లకు తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తుంది పూజిత. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పూజిత.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. ఒకప్పుడు ఎంతో పద్దతిగా కనిపించిన ఈ అమ్మాయి.. ఇప్పుడు గ్లామర్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.