టీవీ షోస్‌లో అనసూయ మ్యాజిక్..రేటింగ్స్‌ను శాసిస్తోన్న యాంకర్

నటి అనసూయ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలతో  అమ్మడు యమ బిజీగా గడుపుతోంది. విభిన్న చానల్స్‌లో, విభిన్న షోస్‌కి హోస్ట్‌గా, జడ్జ్‌గా చేస్తోన్న ఈ నటి రేటింగ్‌లను శాసిస్తోంది. అందాలతో కుర్రకారును టీవీలకు అతుక్కుపోయేలా చేస్తోంది. అనసూయ కోసం ఆయా ప్రొగ్రామ్స్ చూసేవాాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడైతే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో హీరో నాగార్జున పక్కన నటించిందో అప్పట్నుంచి అమ్మడు రేంజ్ మరో లెవల్‌కి వెళ్లింది. ఆమె […]

టీవీ షోస్‌లో అనసూయ మ్యాజిక్..రేటింగ్స్‌ను శాసిస్తోన్న యాంకర్
Ram Naramaneni

|

Mar 04, 2020 | 7:59 PM

నటి అనసూయ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలతో  అమ్మడు యమ బిజీగా గడుపుతోంది. విభిన్న చానల్స్‌లో, విభిన్న షోస్‌కి హోస్ట్‌గా, జడ్జ్‌గా చేస్తోన్న ఈ నటి రేటింగ్‌లను శాసిస్తోంది. అందాలతో కుర్రకారును టీవీలకు అతుక్కుపోయేలా చేస్తోంది. అనసూయ కోసం ఆయా ప్రొగ్రామ్స్ చూసేవాాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడైతే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో హీరో నాగార్జున పక్కన నటించిందో అప్పట్నుంచి అమ్మడు రేంజ్ మరో లెవల్‌కి వెళ్లింది. ఆమె కేవలం అనసూయ మాత్రమే కాదు..అందాల ఖజానా అని అప్పుడే ఆడియెన్స్‌కు అర్థమైంది.

మంచి బజ్ ఉండటంతో,  అమ్మడు కూడా అప్పట్నుంచి అందాల డోస్ పెంచింది. షోస్‌లో చీర కట్టి ఎంట్రీ ఇస్తుంది అంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు అంటున్నారు పలువురు యంగ్ వ్యూయర్స్. ఇక పక్కన ఉంది శేఖర్ మాస్టర్ అయినా, జానీ మాస్టర్ అయినా అనూ అందాలు ముందు దిగదుడుపే. తాజాగా  జీ తెలుగులో ప్రసారం అవుతున్న లోకల్ గ్యాంగ్స్ ప్రోమోలో క్రేజీ స్టెప్పులతో అదరగొట్టింది ఈ స్టార్ యాంకర్. శేఖర్ మాస్టర్ సరసన తెగ హోయలు పోయింది. ఏది ఏమైనా అందాలలో అనూని అందుకునే యాంకర్ ఇప్పట్లో దొరకడం కష్టంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె పారితోషకం కూడా గగనాన్ని తాకుతుంది. మరి ముందు ముందు ఇంకా ఎంతమంది యువకుల మనసులను దోచుకుంటుందో ఈ అందాల అనసూయ.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu