Covid 19 Updates: ఇట్స్ ‘కరోనా’ టైమ్: మాస్క్‌తో ప్రభాస్.. ఫొటోలు వైరల్..!
చాప కింద నీరులా భారత్‌లో కోవిడ్ 19 విస్తరిస్తోంది. మొన్నటికి మొన్న దేశవ్యాప్తంగా రెండు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య 28కు చేరింది. తెలంగాణలో ఒకటి, ఢిల్లీలో ఒకటి, ఆగ్రాలో ఒకటి, కేరళలో మూడు, ఒక డ్రైవర్ సహా ఇటలీ నుంచి వచ్చిన 16మంది
చాప కింద నీరులా భారత్‌లో కోవిడ్ 19 విస్తరిస్తోంది. మొన్నటికి మొన్న దేశవ్యాప్తంగా రెండు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య 28కు చేరింది. తెలంగాణలో ఒకటి, ఢిల్లీలో ఒకటి, ఆగ్రాలో ఒకటి, కేరళలో మూడు, ఒక డ్రైవర్ సహా ఇటలీ నుంచి వచ్చిన 16మంది పర్యాటకులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు టాలీవుడ్‌పై పడింది. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రముఖులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజాగా టాలీవుడ్ ప్రభాస్ మాస్క్‌తో హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు. కరోనా వైరస్ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభాస్ ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది. కాగా మరోవైపు కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో విదేశాలకు షూటింగ్‌లకు వెళ్లాలనుకున్న చాలామంది హీరోలు తమ షెడ్యూల్‌లను వాయిదా వేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న నాగార్జున కూడా తన వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం థాయ్‌లాండ్ వెళ్లాల్సి ఉండగా.. అక్కడ వ్యాధి విస్తరిస్తోన్న క్రమంలో ఆ షెడ్యూల్‌ను వాయిదా వేసుకున్నారు. కాగా కరోనా నేపథ్యంలో రణ్‌బీర్ కపూర్, పరిణీతి చోప్రా, సన్నిలియోన్ తదితరులు ఇటీవల మాస్క్‌లతో కనిపించిన విషయం తెలిసిందే.
Read This Story Also: కరోనా ఎఫెక్ట్: నగరంలోని ఆ ప్రదేశంలో స్కూళ్లు బంద్..!