Ananya Nagalla: భయపెట్టేందుకు వస్తోన్న అనన్య నాగళ్ల.. పిల్లబచ్చాలు అసలు రావొద్దంటూ హెచ్చరిక..
అటు పెద్ద చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూనే.. చిన్న చిన్న సినిమాల్లో కథానాయికగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ అందాల ముద్దుగుమ్మ హారర్ సినిమాతో సినీ ప్రియులను భయపెట్టేందుకు రెడీ అయ్యింది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటేస్ట్ హారర్ మూవీ 'తంత్ర'. ఇందులో ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశి, మీసాల లక్ష్మణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న మూవీ ఇది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ భయపెట్టింది. అలాగే ఇటీవల రిలీజ్ అయిన రొమాంటిక్ మెలోడి సాంగ్ కూడా ఆకట్టుకుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోయిన్గా రాణిస్తోన్న తెలుగమ్మాయిలలో అనన్య నాగళ్ల ఒకరు. మల్లేశం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే కాకుండా సహాయ నటిగా కనిపిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటుంది. మ్యాస్ట్రో, శాకుంతలం చిత్రాల్లో నటించి మెప్పించింది. అటు పెద్ద చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూనే.. చిన్న చిన్న సినిమాల్లో కథానాయికగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ అందాల ముద్దుగుమ్మ హారర్ సినిమాతో సినీ ప్రియులను భయపెట్టేందుకు రెడీ అయ్యింది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటేస్ట్ హారర్ మూవీ ‘తంత్ర’. ఇందులో ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశి, మీసాల లక్ష్మణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న మూవీ ఇది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ భయపెట్టింది. అలాగే ఇటీవల రిలీజ్ అయిన రొమాంటిక్ మెలోడి సాంగ్ కూడా ఆకట్టుకుంది.
ఇక ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. ఇప్పుడు సెన్సార్ పనులు కంప్లీట్ చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే రోటీన్ గా కాకుండా కాస్త వెరైటీగా ఈ పోస్టర్ డిజైన చేశారు. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రానికి A సర్టిఫికెట్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు పిచ్చబచ్చాలు రావద్దంటూ హెచ్చరిస్తూ ‘A’ ని పెద్దగా హైలైట్ చేస్తూ పోస్టర్ డిజైన్ చేశారు. అలాగే ఈ పోస్టర్ షేర్ చేస్తూ ఆసక్తికర క్యాప్షన్ రాసుకొచ్చారు.
“టెడ్డీబేర్‌కి మీరు జోలపాడితే బాగుంటుంది.. కానీ ఆ టెడ్డీబేర్ మీకు జోల పాడితే..ఆ ఊహే భయంకరంగా ఉంది కదా! అలాంటిదే ఈ ‘తంత్ర’ సినిమా.మార్చి 15న మీముందుకు వస్తోంది.మీరు సిద్ధమా? ” అంటూ రాసుకొచ్చారు. హారర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ వచ్చినట్లుగా తెలుస్తోంది.అయితే సెన్సార్ పూర్తైందని చెబుతూ.. పిల్లబచ్చాలు రావొద్దంటూ పెద్దగా పోస్టర్ డిజైన్ చేసి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు మేకర్స్. దీంతో ఇప్పుడు తంత్ర మూవీపై మరింత క్యూరియాసిటి ఏర్పడింది. ఈ సినిమాకు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




