Bommarillu: అబ్బాయిలకు తెగ నచ్చేసిన సినిమా మళ్లీ వస్తోంది.. ‘బొమ్మరిల్లు’ రీరిలీజ్.. ఎప్పుడంటే..
ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా కలీజ 'ఓయ్' సినిమా రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఓయ్ రీరిలీజ్ తర్వాత థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్ట్స్ దర్శనమిచ్చాయి. సిద్ధా్ర్థ్, షామిలి అందమైన లవ్ స్టోరీకి అడియన్స్ ఫిదా కాగా.. ఈ మూవీలోని సాంగ్స్ గురించి అసలు చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని పాటలకు డాన్స్ చేస్తూ అదరగొట్టేశారు. ఇక ఇప్పుడు మరో మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. అదే 'బొమ్మరిల్లు'.
రీరిలీజ్ ట్రెండ్ ఇప్పుడు సినీ ప్రియులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకప్పుడు థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన చిత్రాలు.. ఇప్పుడు మళ్లీ వస్తుండడంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు యూత్. స్టార్ హీరో సినిమానా.. భారీ బడ్జెట్ చిత్రాలు కాదు.. అప్పట్లో మిక్స్డ్ టాక్ అందుకున్న సినిమాలు.. ఇప్పుడు మరోసారి విడుదలై భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా కలీజ ‘ఓయ్’ సినిమా రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఓయ్ రీరిలీజ్ తర్వాత థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్ట్స్ దర్శనమిచ్చాయి. సిద్ధా్ర్థ్, షామిలి అందమైన లవ్ స్టోరీకి అడియన్స్ ఫిదా కాగా.. ఈ మూవీలోని సాంగ్స్ గురించి అసలు చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని పాటలకు డాన్స్ చేస్తూ అదరగొట్టేశారు. ఇక ఇప్పుడు మరో మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. అదే ‘బొమ్మరిల్లు’.
ఒకప్పుడు హీరో సిద్ధార్థ్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. బాయ్స్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, ఓయ్, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో ఓయ్, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా చిత్రాలు రీరిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు సూపర్ హిట్ బొమ్మరిల్లు మూవీ మళ్లీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ నెలలో హీరో సిద్ధార్థ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీని మళ్లీ రిలీజ్ చేయాలనుకుంటున్నారట.
భాస్కర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ మూవీలో సిద్ధార్థ్, జెనీలియా జంటగా నటించారు. 2006లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో ప్రకాష్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాస్ రావు, తనికెళ్ల భరణి కీలకపాత్రలు పోషించారు. కంటెంట్ పరంగానే కాకుండా మ్యూజిక్ పరంగానూ ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అప్పుడే ఉత్తమ చిత్రం కేటగిరిలో నంది అవార్డ్ అందుకుంది. అలాగే ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాష్ రాజ్, ఉత్తమ నటి స్పెషల్ జ్యూరీ అవార్డ్ జెనీలియా అందుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.