Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambani Wedding: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి టాలీవుడ్ హీరో.. ఈ స్టైలీష్ స్టార్ హీరోను గుర్తుపట్టారా..?

ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ల వివాహం మహోత్సవం ఈరోజు (జూలై 12న) అట్టహాసంగా జరగనుంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‏లో నిర్వహించనున్న ఈ వేడుకలలో శుక్రవారం అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు.

Ambani Wedding: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి టాలీవుడ్ హీరో.. ఈ స్టైలీష్ స్టార్ హీరోను గుర్తుపట్టారా..?
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 12, 2024 | 12:37 PM

అంబానీ ఇంట పెళ్లి వేడుకులు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ల వివాహం మహోత్సవం ఈరోజు (జూలై 12న) అట్టహాసంగా జరగనుంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‏లో నిర్వహించనున్న ఈ వేడుకలలో శుక్రవారం అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ వేడుకకు వివిధ దేశాల నుంచి ప్రముఖ నటీనటులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అతిథులుగా రానున్నారు. ఇప్పటికే పలువురు బడా పారిశ్రామిక వేత్తలు, సహాలీవుడ్ తారలు కిమ్ కర్దాషియన్, ఖ్లో కర్దాషియన్, ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ దంపతులు ముంబై చేరుకున్నారు. అలాగే బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్, అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి జాన్ కెర్రీ, స్వీడన్ మాజీ ప్రధాని కార్ల బిడ్త్, కెనడా మాజీ ప్రధాని స్టీపెన్ హార్పర్, టాంజానియా అధ్యక్షురాలు సామి సులుహు హస్సన్ ఇలా చాలా మంది ప్రముఖులు వస్తున్నట్లు సమాచారం.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒక హీరో మాత్రమే వెళ్లనున్నట్లు ముందు నుంచి టాక్ నడిచింది. అతడే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. గురువారమే భార్య ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి ముంబై చేరుకున్నారు రామ్ చరణ్. ఇక ఈరోజు ఉదయం మరో టాలీవుడ్ హీరో అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు బయలుదేరాడు. శుక్రవారం ఉదయం ఫ్యామిలీతో కలిసి ఎయిర్ పోర్టులో కనిపించారు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ? అతడే సూపర్ స్టార్ మహేష్ బాబు.

ఈరోజు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‏లో జరగనున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలకు సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంతో సహా హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం భార్య నమ్రత, కూతురు సితారతో కలిసి ఎయిర్ పోర్టులో కనిపించారు. ఇదిలా ఉంటే.. గత రెండు వారాలుగా విదేశాల్లోనే ఉన్నారు మహేష్. ఫ్యామిలీతో కలిసి లండన్, జర్మనీ వెకేషన్ వెళ్లిన మహేష్.. రెండు రోజుల క్రితమే తిరిగొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలయ్యాయి. తాజాగా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు వెళ్తున్న మహేష్ న్యూలుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా లాంగ్ హెయిర్, గడ్డంతో అచ్చం హాలీవుడ్ రేంజ్ హీరోలా కనిపిస్తున్నాడు మహేష్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.