- Telugu News Photo Gallery Cinema photos Actress Reba Monica john no offers in Tollywood after success movie samajavaragamana Telugu Heroines Photos
Reba Monica john: సూపర్ హిట్ ఇచ్చిన బ్యూటీని కూడా పట్టించుకోకపోతే ఎలా.? రెబ్బా మోనికా జాన్
ఫ్లాప్ ఇచ్చిన హీరోయిన్లకు ఛాన్సులు రాలేదంటే ఏమో అనుకోవచ్చు.. కానీ సూపర్ హిట్ ఇచ్చిన బ్యూటీని కూడా పట్టించుకోకపోతే ఎలా..? ఇండస్ట్రీలో ఇదే జరుగుతుందిప్పుడు. గతేడాది బ్లాక్‌బస్టర్‌తో ఎంట్రీ ఇచ్చిన ఓ బ్యూటీ.. అవకాశాల కోసం తెగ కష్టపడుతుంది పాపం. మరి బ్రేక్ ఇచ్చే సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్న ఆ భామ ఎవరో తెలుసా..? కొన్నిసార్లు హీరోయిన్ల పేర్లు ప్రేక్షకులకు గుర్తుండవు.. కానీ వాళ్లు నటించిన సినిమాలు మాత్రం అలాగే మైండ్‌లో ఉండిపోతాయి.
Updated on: Jul 12, 2024 | 12:28 PM

ఫ్లాప్ ఇచ్చిన హీరోయిన్లకు ఛాన్సులు రాలేదంటే ఏమో అనుకోవచ్చు.. కానీ సూపర్ హిట్ ఇచ్చిన బ్యూటీని కూడా పట్టించుకోకపోతే ఎలా..? ఇండస్ట్రీలో ఇదే జరుగుతుందిప్పుడు. గతేడాది బ్లాక్‌బస్టర్‌తో ఎంట్రీ ఇచ్చిన ఓ బ్యూటీ.. అవకాశాల కోసం తెగ కష్టపడుతుంది పాపం.

మరి బ్రేక్ ఇచ్చే సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్న ఆ భామ ఎవరో తెలుసా..? కొన్నిసార్లు హీరోయిన్ల పేర్లు ప్రేక్షకులకు గుర్తుండవు.. కానీ వాళ్లు నటించిన సినిమాలు మాత్రం అలాగే మైండ్‌లో ఉండిపోతాయి.

అలా మన ఆడియన్స్‌కు బాగానే నోటెడ్ అయిన ముద్దుగుమ్మ రెబ్బా మోనికా జాన్. గతేడాది శ్రీ విష్ణు నటించిన సామజవరగమనాతో టాలీవుడ్‌కు వచ్చారు ఈ బ్యూటీ.

ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రెబ్బా. సామజవరగమనా బ్లాక్‌బస్టర్ కావడంతో రెబ్బా జాతకం మారిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు.. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా తర్వాత శ్రీ విష్ణు జాతకం మారింది.

మార్కెట్ పెరిగింది కానీ రెబ్బా వైపు మాత్రం ఏ హీరో చూడలేదు. చివరికి మరోసారి శ్రీ విష్ణు సినిమాలోనే ఆఫర్ అందుకున్నారు ఈ బ్యూటీ. ఈ కాంబో రిపీట్ అవుతుందిప్పుడు.

హుసేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్‌లో కలిసి నటిస్తున్నారు శ్రీ విష్ణు, రెబ్బా. ఇది కాకుండా రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కూలీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు రెబ్బా మోనిక.

అలాగే కన్నడ, మలయాళంలోనూ ఆఫర్స్ వస్తున్నాయి కానీ తెలుగులో మాత్రం రెబ్బాకు ఆఫర్స్ ఆశించినంతగా రావట్లేదు. మరి చూడాలిక.. ఈ బ్యూటీ జాతకం ఎప్పటికి మారుతుందో..?




