AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Movies : సినిమా చూసి రివ్యూ చెప్తే చాలు లక్షలు ఇస్తారట.. ఎక్కడో తెలుసా..

సినిమాలు చూసి రివ్యూ చెప్తే చాలు ఏకంగా లక్షరూపాయలు ఇస్తామంటున్నారు. ఇలా బంపర్ ఆఫర్ ఇచ్చింది ఎవరో కాదు ఓ అమెరికన్ కంపెనీ. కేవలం సినిమా చేసి తమ అభిప్రాయం చెప్తే చాలు డబ్బులు ఇస్తాం అంటున్నారు. యూఎస్‌కు చెందిన బ్లూమ్‌సీబాక్స్‌ అనే సంస్థ ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది. వివిధ సంవత్సరాల్లో రిలీజ్ అయిన సినిమాలను చూసి రివ్యూ ఇస్తే చాలట.

Movies : సినిమా చూసి రివ్యూ చెప్తే చాలు లక్షలు ఇస్తారట.. ఎక్కడో తెలుసా..
Movies
Rajeev Rayala
|

Updated on: Nov 17, 2023 | 9:50 AM

Share

ఇన్ని రోజులు మనం డబ్బులు కట్టి సినిమా చూశాం కానీ ఇప్పుడు సినిమా చూస్తే డబ్బులు ఇస్తాం అంటున్నారు. అది కుడా వందలు, వేలు కాదు ఏకంగా లక్ష రూపాలు ఇస్తాం అంటున్నారు. సినిమాలు చూసి రివ్యూ చెప్తే చాలు ఏకంగా లక్షరూపాయలు ఇస్తామంటున్నారు. ఇలా బంపర్ ఆఫర్ ఇచ్చింది ఎవరో కాదు ఓ అమెరికన్ కంపెనీ. కేవలం సినిమా చేసి తమ అభిప్రాయం చెప్తే చాలు డబ్బులు ఇస్తాం అంటున్నారు. యూఎస్‌కు చెందిన బ్లూమ్‌సీబాక్స్‌ అనే సంస్థ ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది. వివిధ సంవత్సరాల్లో రిలీజ్ అయిన సినిమాలను చూసి రివ్యూ ఇస్తే చాలట. క్రిస్మస్ కు వచ్చిన సినిమాలను చూసి రివ్యూ ఇవ్వాలట. ఇలా 12 సినిమాలు చూసి రివ్యూ ఇవ్వాలని కోరింది.

ఎంపికైన వాళ్లు సినిమాలు చేసి ఆ రివ్యూ ని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తే చాలు. ఆ రివ్యూలను బట్టి కొంతమందిని ఎంపిక చేస్తుంది సదరు కంపెనీ. ఎంపికైన వారికి 2000 డాలర్లు(1.6 లక్షలు )ఇస్తామని అనౌన్స్ చేశారు. ఎంపికైనవారికిడబ్బులతోపాటు హాట్ కోకా, యూజీజీ సాక్స్‌లు, పీకాక్‌కి ఒక ఏడాది పాటు సబ్‌స్క్రిప్షన్, 12 నెలల ఫ్లవర్ సబ్‌స్క్రిప్షన్‌ను ఆ కంపెనీ అందజేస్తుంది.

ప్రేక్షకులు చూడాల్సిన సినిమాలు ఇవే..

1. ది మోస్ట్ వండర్ఫుల్ టైమ్ ఆఫ్ ది ఇయర్ (2008)

2. క్రౌన్ ఫర్ క్రిస్మస్ (2015)

3. ది నైన్ లైవ్స్ ఆఫ్ క్రిస్మస్ (2014)

4. క్రిస్మస్ గెటవే (2017)

5. జర్నీ బ్యాక్ టు క్రిస్మస్ (2016)

6. గోస్ట్స్ ఆఫ్ క్రిస్మస్ ఆల్‌వేస్‌ (2022)

7. ఫ్యామిలీ ఫర్‌ క్రిస్మస్ (2015)

8. క్రిస్మస్ అండర్ రాప్స్ (2014)

9. త్రీ వైస్‌ మెన్‌ అండ్‌ ఏ బేబీ (2022)

10. ఎ రాయల్ క్రిస్మస్ (2014)

11. నార్త్‌పోల్ (2014)

12. ది క్రిస్మస్ ట్రైన్‌ (2017)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.