Shah Rukh Khan ‘Jawan’: షారుక్ ఖాన్ జవాన్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ కళ్ళు చెదిరే ఆఫర్.. కానీ
. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు షారుక్. అయితే షారుక్ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సినిమాకోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చివరిగా జీరో సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చాడు షారుక్. అయితే రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాతర్వాత షారుక్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు షారుక్. అయితే షారుక్ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నటిస్తోన్న సినిమాల్లో ఒకటి పఠాన్ , మరొకటి జవాన్ . వీటిట్లో జవాన్ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో షారుక్ సరసన లేడీ సూపర్ స్టార్ నాయన తార నటిస్తోంది.
ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ కథను రెడీ చేశారట. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ మొత్తం ఆఫర్ చేసిందట. జవాన్ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇందుకోసం 100కోట్ల డీల్ ను సెట్ చేసిందని అంటున్నారు.
అయితే మేకర్స్ మాత్రం 150 కోట్లు కోట్ చేసినట్లు తెలుస్తోంది.అయితే 150కోట్లకు డీల్ క్లోజ్ చేద్దాం అన్న విషయాన్నీ అమెజాన్ కి చెప్పారట. త్వరలోనే ఈ విషయం పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక జవాన్ సినిమాను తెలుగు, హిందీ..తమిళ్ భాషల్లో భారీగా రిలీజ్ చేయనున్నారు. ఇక అట్లీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. అందుకే పిలిచి మరి సినిమా ఇచ్చాడు షారుక్. ఇక ఈ సినిమాలో విలన్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమానుంచి క్రేజీ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది.




మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




