AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: సతీమణికి మద్దతుగా ఐకాన్ స్టార్.. అల్లు స్నేహ రెడ్డి పికాబు ప్రెసెంట్ ఫైర్ ఫ్లై కార్నివాల్‏లో బన్నీ సందడి..

గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప చిత్రానికి సీక్వెల్‏గా ఈ మూవీని రూపొందిస్తున్నారు సుక్కు. ఇందులో ఫహాద్ ఫాజిల్, రష్మిక మందన్నా కీలకపాత్రలు పోషిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ ఏడాది ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అయితే శనివారం తన భార్య అల్లు స్నేహరెడ్డి కోసం పుష్ప 2 షూటింగ్ మధ్యలోనే వచ్చేశానని అంటున్నారు బన్నీ. ఇంతకీ ఎందుకో తెలుసా ?..

Allu Arjun: సతీమణికి మద్దతుగా ఐకాన్ స్టార్.. అల్లు స్నేహ రెడ్డి పికాబు ప్రెసెంట్ ఫైర్ ఫ్లై కార్నివాల్‏లో బన్నీ సందడి..
Allu Arju, Sneha Reddy
Rajitha Chanti
|

Updated on: Jan 21, 2024 | 7:02 AM

Share

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెకర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప చిత్రానికి సీక్వెల్‏గా ఈ మూవీని రూపొందిస్తున్నారు సుక్కు. ఇందులో ఫహాద్ ఫాజిల్, రష్మిక మందన్నా కీలకపాత్రలు పోషిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ ఏడాది ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అయితే శనివారం తన భార్య అల్లు స్నేహరెడ్డి కోసం పుష్ప 2 షూటింగ్ మధ్యలోనే వచ్చేశానని అంటున్నారు బన్నీ. ఇంతకీ ఎందుకో తెలుసా ?.. అల్లు ఫ్యామిలీ గురించి తెలిసిందే. ఇటు సినీ నిర్మాణ రంగంలో గీతా ఆర్ట్స్ పేరిట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే ఎప్పుడూ వ్యాపార రంగాల్లో ఎప్పుడూ ముందుండే అల్లు కుటుంబం నుంచి ఇప్పుడు బన్నీ సతీమణి అల్లు స్నేహారెడ్డి పికాబు సంస్థ స్థాపించింది. ఈ సంస్థ సమర్పిస్తున్న ఫైర్ ఫ్లై కార్నివల్ని శనివారం మాధాపూర్ ఎన్ కన్వెన్షన్ లో నిర్వహించారు. ఈ ఫ్యామిలీ కార్నివాల్ గ్రాండ్ గా చేయడం కోసం పికాబు సంస్థ టాప్ స్టిచ్ సంస్థతో జతకట్టింది. ఈ కార్నివాల్ కి ముఖ్య అతిధి గా అల్లు అర్జున్ వచ్చారు. ఈ సందర్భంగా అల్లు స్నేహ రెడ్డికి, నాగు రెడ్డి, స్మిత రెడ్డి కి అభినందనలు తెలిపారు బన్నీ. అనంతరం బన్నీ పుష్ప షూట్ మధ్యలో నుంచి వచ్చానని అన్నారు.

అలాగే ఈ ఫైర్ ఫ్లై కార్నివాల్ ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన అల్లు స్నేహ రెడ్డి, నాగు రెడ్డి, స్మిత రెడ్డికి తన తరుపున అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత సపోర్ట్ చేసిన మీడియాకి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు బన్నీ. అల్లు స్నేహరెడ్డి సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‏గా ఉంటూ.. ఫ్యామిలీ విషయాలను పంచుకుంటుంది. ముఖ్యంగా అల్లు అయాన్, అల్లు అర్హతో కలిసి బన్నీ చేసే అల్లరి వీడియోస్ స్నేహ ఎక్కువగా షేర్ చేస్తుంటారు.

View this post on Instagram

A post shared by @thefireflycarnival

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.