భారీ అంచనాలు నెలకొన్న పుష్ప 2 మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ భారీ యాక్షన్ డ్రామా రేపు డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం భారతీయులే కాదు.. వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ యూట్యూబ్ ను ఊపేస్తున్నాయి. కిస్సిక్, పీలింగ్స్ పాటలకు చిన్న, పెద్ద తేడా లేకుండా స్టెప్పులేస్తున్నారు. మరోవైపు కొన్నిరోజులుగా వరుస ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇటీవలే హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పుష్ప 2 ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈరోజు రాత్రి కొన్ని చోట్ల ప్రీమియర్ షోస్ వేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక ప్రీమియర్ షో చూసేందుకు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. అభిమానులతో కలిసి అల్లు అర్జున్ సినిమా చూడనున్నారట. ఈరోజు రాత్రి 9.30 గంటల షోకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య 70mm థియేటర్లో ఫ్యాన్స్ తో కలిసి పుష్ప 2 సినిమా చూడబోతున్నారు. దీంతో రాత్రికి బన్నీ ఫ్యాన్స్ సంధ్య థియేటర్ వద్దకు భారీగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు సృష్టిస్తోంది పుష్ప 2 సినిమా. విడుదలకు ముందే 100 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అలాగే అమెరికాలో కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ 3 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. గతంలో విడుదలైన పుష్ప 1 బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సినిమాపై భారీ హైప్ నెలకొంది.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.