AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: బాబోయ్.. అల్లు అర్జున్ స్వెట్‏షర్ట్ ధర తెలిస్తే మైండ్ బ్లాంకే.. స్టైలీష్ స్టార్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..

ఇప్పటికే విడుదలైన బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‏లో పుష్ప ది రైజ్ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఒకటి. ఇందులో ప్రదర్శించే సినిమాకు అంతర్జాతీయ ప్రశంసలు మాత్రమే కాదు.. నటుడిగా బన్నీకి ప్రపంచవ్యాప్తంగా స్టార్ డమ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అయితే బెర్లిన్ కు బయలుదేరిన బన్నీ.. ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు.

Allu Arjun: బాబోయ్.. అల్లు అర్జున్ స్వెట్‏షర్ట్ ధర తెలిస్తే మైండ్ బ్లాంకే.. స్టైలీష్ స్టార్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Feb 17, 2024 | 8:55 AM

Share

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని త్వరలోనే అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.  ఇప్పటికే విడుదలైన బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై అంచనాలను పెంచేసింది. 2021లో విడుదలైన ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయి భారీ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమాతో ఉత్తరాదిలో బన్నీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం నార్త్ అడియన్స్ ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‏లో పుష్ప ది రైజ్ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఒకటి. ఇందులో ప్రదర్శించే సినిమాకు అంతర్జాతీయ ప్రశంసలు మాత్రమే కాదు.. నటుడిగా బన్నీకి ప్రపంచవ్యాప్తంగా స్టార్ డమ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అయితే బెర్లిన్ కు బయలుదేరిన బన్నీ.. ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు.

అయితే ఎప్పుడు తన ట్రెండీ స్టైలీష్ లుక్స్‏తో స్పెషల్ అభిమానులను ఆకట్టుకుంటారు బన్నీ. ఇటీవలే హైదరాబాద్ ఎయిర్ పోర్టులో బుర్బెర్రీ మోనోగ్రామ్ మోటిఫ్ అప్లిక్ కాటన్ స్వెట్ షర్ట్ ధరించి కనిపించాడు. ఈ షర్ట్ ధర సుమార రూ. 28,000. లగ్జరీ, కంఫర్ట్ రెండింటికి ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు బన్నీ. ఏదైనా ఫిల్మ్ అవార్డ్ ఫంక్షన్‌కి లేదా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లకు హాజరైనప్పుడల్లా స్టైలీష్ అండ్ కూల్ లుక్ లో కనిపిస్తారు.

ఇక ఈ గ్లోబల్ ఈవెంట్లో అల్లు అర్జున్.. అంతర్జాతీయ చిత్రనిర్మాతలు, దర్శకులతో ముచ్చటించనున్నారు. స్క్రీనింగ్‌తో పాటు అంతర్జాతీయ ప్రెస్‌తో ఇంటరాక్ట్ కానున్నారు బన్నీ. పుష్ప 2 తర్వాత యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు బన్నీ. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో మరో సినిమా చేయనున్నారు. పుష్ప 2 విడుదల తర్వాత బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పట్టాలెక్కనున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.