Emraan Hashmi: అడివి శేష్ సినిమాలో విలన్‌గా ఇమ్రాన్ హష్మీ.. భారీ డిమాండ్ చేస్తోన్న బాలీవుడ్ హీరో..
ఆదిపురుష్ సినిమాతో రావణుడిగా పలకరించిన సైఫ్.. ఇప్పుడు దేవర మూవీతో మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. అలాగే మరికొన్ని సినిమాలకు సైఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో స్టార్ హీరో సౌత్ అడియన్స్ ముందుకు వస్తున్నారు. అతడే ఇమ్రాన్ హష్మీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో సాహో డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ చిత్రంలో ఇమ్రాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇక ఇప్పుడు మరో హీరో మూవీకి ఒకే చెప్పాడు. అంతేకాదు.. తన రెమ్యునరేషన్ కూడా భారీగానే పెంచేశాడట.

ప్రస్తుతం తెలుగు సినిమాల్లో బాలీవుడ్ విలన్స్ హవా పెరిగిపోయింది. ఉత్తరాదిలో స్టార్ హీరోలుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటులు.. ఇప్పుడు దక్షిణాదిలో మాత్రం విలనిజం చూపిస్తున్నారు. ఇప్పటికే కేజీఎఫ్ సినిమాతో సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ గా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలాగే ఆదిపురుష్ సినిమాతో రావణుడిగా పలకరించిన సైఫ్.. ఇప్పుడు దేవర మూవీతో మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. అలాగే మరికొన్ని సినిమాలకు సైఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో స్టార్ హీరో సౌత్ అడియన్స్ ముందుకు వస్తున్నారు. అతడే ఇమ్రాన్ హష్మీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో సాహో డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ చిత్రంలో ఇమ్రాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇక ఇప్పుడు మరో హీరో మూవీకి ఒకే చెప్పాడు. అంతేకాదు.. తన రెమ్యునరేషన్ కూడా భారీగానే పెంచేశాడట. తన రెండవ తెలుగు సినిమా కోసం భారీగానే డిమాండ్ చేస్తున్నాడు ఇమ్రాన్ హష్మీ.
గూఢచారి సినిమాతో అడివి శేష్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు. ఇప్పుడు గూఢచారి 2 సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి అడివి శేష్ స్వయంగా స్క్రిప్ట్ రాశాడు. ఇందులో విలన్ గా బాలీవుడ్ హీరో అడివి శేష్ నటిస్తున్నారు. హిందీలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. దీంతో ఈ చిత్రానికి ఇమ్రాన్ హష్మీ ఛార్జ్ చేస్తున్న రెమ్యునరేషన్ మాత్రం షాకింగ్‌గా ఉంది. కేవలం ఈ మూవీకి రూ. 7 కోట్లు వసూలు చేస్తున్నాడట. ఈ మూవీలో తన పాత్రకు ఇంతపెద్ద మొత్తంలో ఇవ్వడం కాస్త ఎక్కువే అయినప్పటికీ ఇమ్రాన్ పాత్రకు సరిగ్గా సరిపోతాడని భావిస్తున్నారట మేకర్స్. అందుకే రెమ్యునరేషన్ విషయంలో వెనక్కి తగ్గడం లేదట.
అడివి శేష్ హీరోగా.. ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్న ఈ మూవీకి విన్య కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతోనే విన్య దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇందులో బనితా సంధు కతానాయికగా నటిస్తుండగా.. అభిషేక్ అగర్వాల్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




