Pushpa Song: దేశాలు దాటుతున్న పుష్ప క్రేజ్.. పుష్పరాజ్‌ శ్రీవల్లి స్టెప్పును అలాగే దించేశాడుగా…

పుష్ప సినిమా ప్రస్తుతం వరల్డ్‌ వైడ్ బజ్‌ చేస్తోంది. సోషల్ మీడియాలో నయా ట్రెండ్ ను క్రియేట్ చేస్తోంది. పుష్ప రాజ్‌ డైలాగునో... గెటప్‌నో.. డ్యాన్స్‌నో.. లేక సాంగ్‌నో...!

Pushpa Song: దేశాలు దాటుతున్న పుష్ప క్రేజ్..  పుష్పరాజ్‌ శ్రీవల్లి స్టెప్పును అలాగే దించేశాడుగా...
Dance Video
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 13, 2022 | 8:24 PM

Pushpa : పుష్ప సినిమా ప్రస్తుతం వరల్డ్‌ వైడ్ బజ్‌ చేస్తోంది. సోషల్ మీడియాలో నయా ట్రెండ్ ను క్రియేట్ చేస్తోంది. పుష్ప రాజ్‌ డైలాగునో… గెటప్‌నో.. డ్యాన్స్‌నో.. లేక సాంగ్‌నో…! ఇమిటేట్ చేసేలా.. ఫాలో అయ్యేలా.. రీల్స్ చేసేలా చేస్తోంది.ఇక శ్రీవల్లి సాంగ్‌లో ఊరమాసుగా.. కాస్త వెరైటీగా చేసిన స్టెప్పు ప్రస్తుతం అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. బన్నీ కాలు సాగదీసి అదోమాదిరిగా ఈ స్టెప్పు చేసిన విధానం అందర్నీ ఇమిటేట్‌ చేసేలా చేస్తోంది. తాజాగా ఇదే స్టెప్‌ను టాంజానియాకు చెందిన ఓ వ్యక్తి ఇన్‌స్టా రీల్‌గా చేశాడు.

ఇప్పటికే పుష్ప సినిమాలో డైలాగును.. బన్నీ మ్యానరిజాన్ని ఇమిటేట్‌ చేస్తూ రీల్స్ చేసినీ టాంజానియా క్రియేటర్… తాజాగా ఈ స్టెప్పును అచ్చం పుష్ప రాజ్‌ లాగే చేసి … బన్నీ ఫాలోవర్స్ చేత క్లాప్స్ కొట్టించుకుంటున్నాడు. ఇండియాలో వైలర్ అవుతున్నాడు. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్ గా నటించి ఆకట్టుకున్నాడు. మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో విపరీతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది పుష్ప.