Allu Arjun: ఫ్రీ టైం ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్.. అర్హతో బన్నీ రన్నింగ్ రేస్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం పుష్ప హిట్ ఎంజాయ్ చేస్తున్నాడు. డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం పుష్ప హిట్ ఎంజాయ్ చేస్తున్నాడు. డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక హిందీలో పుష్ప సినిమా ఆల్ టైం రికార్డ్ సాధించింది. ఇక పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఏప్రిల్‌లో స్టార్ట్ కానుంది. దీంతో బన్నీ తన ఫ్రీ టైంను ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. అల్లు అర్జున్.. తన కుటుంబానికి ఎంతగా ప్రాధాన్యత ఇస్తారో తెలిసిన విషయమే. కాస్త్ ఖాళీ సమయం దొరికితే చాలు.. కూతురు అర్హ.. తనయుడు అయాన్‌తో కలసి సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఇక బన్నీ, పిల్లలతో కలిసి ఇంట్లో చేసే సరదా అల్లరిని.. ఆయన సతిమణి స్నేహా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇప్పటికే అల్లు అర్జున్.. అర్హ.. అయాన్ కలిసి ఫ్రీ టైంలో ఎంజాయ్ చేస్తున్న వీడియోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి.
తాజాగా ఈ సండే అల్లు అర్జున్.. తన కూతురు అర్హతో కలిసి రన్నింగ్ రేస్‌లో పాల్గొన్నాడు. తన ఇంటి ఆవరణలో చిన్నారితో పోటీ పెట్టుకుని రన్నింగ్ చేస్తున్నాడు. ఈ వీడియోను అల్లు స్నేహ తన ఇన్‍స్టాలో షేర్ చేశారు. అందులో అల్లు అర్జున్.. తన కూతురు అర్హను గెలిపించడం కోసం బన్నీ కావాలని వెనకబడడం.. ఇక గెలిచిన తర్వాత అర్హను ఎత్తుకొని ఆనందంతో ముద్దాడడం ఎంతో చూడముచ్చటగా ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. బన్నీ తన కూతురుపై చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయ్యారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. బన్నీ.. కూతురు.. కుమారుడితో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోస్.. ఫోటోస్.. సోషల్ మీడియాలో అనేకం ఉన్నాయి.
ఇక మరోవైపు సోషల్ మీడియాలో పుష్ప ట్రెండ్ కొనసాగుతుంది. పుష్పరాజ్ మేనరిజం, పుష్ప సాంగ్స్‌కు నెటిజన్స్ స్టెప్పులేస్తున్నారు. సామాన్యులు మాత్రమే కాకుండా.. సెలబ్రెటీలు.. క్రికెటర్స్ పుష్ప పాటలకు కాలు కదుపుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
View this post on Instagram
Also Read: Lata Mangeshkar: రాజ్‌కపూర్‌పై అలిగిన లతా మంగేష్కర్.. ఎందుకు అలా చేసిందంటే..
Shruti Haasan: పచ్చని ప్రకృతి నడుమ ఫోటోలకు ఫోజులిచ్చిన ‘శ్రుతి హాసన్’ సొగసులు చూడతరమా..(ఫొటోస్)