Allu Arjun: పుష్ప 2 కోసం అల్లు అర్జున్ షాకింగ్ రెమ్యునరేషన్.. ఏకంగా రజనీని మించి.. ఎన్ని కోట్లో తెలుసా?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప ఓ మరుపురాని చిత్రంగా మిగిలిపోయింది. ఈ సినిమాతో ఓవర్‌నైట్ లోనే పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు బన్నీ. ఈ మూవీలో అద్భుత నటనకు గానే జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం కూడా అందుకున్నాడు. ఇలా బన్నీ కెరీర్‌ను మలుపు తిప్పిన పుష్ప సీక్వెల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న పుష్ప 2

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప ఓ మరుపురాని చిత్రంగా మిగిలిపోయింది. ఈ సినిమాతో ఓవర్‌నైట్ లోనే పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు బన్నీ. ఈ మూవీలో అద్భుత నటనకు గానే జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం కూడా అందుకున్నాడు. ఇలా బన్నీ కెరీర్‌ను మలుపు తిప్పిన పుష్ప సీక్వెల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న పుష్ప 2 వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం కానుకాగా ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం, సీక్వెల్ కోసం అల్లు అర్జున్ షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం పుష్ప 2 థియేట్రికల్, OTT, శాటిలైట్, డబ్బింగ్, ఆడియో హక్కులతో సహా ప్రీ-సేల్స్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో 33% వాటాను అల్లు అర్జున్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం పుష్ప2కు 1000 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యే చాన్స్ ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 33 శాతం అంటే.. అల్లు అర్జున్‌కు దాదాపు రూ. 300 కోట్ల వరకు వస్తుందని తెలుస్తోంది. ఒక వేళ ఇదే నిజమైతే భారతీయ సినిమా పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుడిగా అల్లు అర్జున్ సరికొత్త రికార్డు సృష్టిస్తాడు.
ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్‌గా గుర్తింపు ఉంది. అతను ఒక్కో సినిమా కోసం రూ. 200కు పైగా కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ప్రభాస్, సల్మాన్, షారుక్ తదితర స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు రూ. 150-200 కోట్లు తీసుకుంటున్నారు. ఒక వేళ పుష్ప 2పై వస్తోన్న వార్తలు నిజమైతే బన్నీ చరిత్ర సృష్టించినట్లే. ఇక అభిమానులందరి అంచనాలు అందుకునేలా పుష్ప 2 సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తోంది. పుష్ప 2లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. డాలీ ధనంజయ్, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ సహా పలువురు ప్రముఖ ఆర్టిసులు నటిస్తున్నారు. త్వరలోనే పుష్ప 2 ది రూల్ గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
పుష్ప 2 సెట్ లో అల్లు అర్జున్, సుకుమార్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.