Allu Arjun: వరదబాధితులకు అండగా ఐకాన్ స్టార్.. భారీ విరాళం ప్రకటించిన అల్లు అర్జున్..

భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకొని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కాగా వరద బాధితులను అందుకునేందుకు సినీ లోకం కదిలింది. ఇప్పటికే చాలామంది సినీ తారలు రెండు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా వరదబాధితులకు అండగా నిలిచారు.

Allu Arjun: వరదబాధితులకు అండగా ఐకాన్ స్టార్..  భారీ విరాళం ప్రకటించిన అల్లు అర్జున్..
Allu Arjun
Follow us

|

Updated on: Sep 04, 2024 | 1:14 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు నగరాలను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికి చాలా మంది నీళ్లలో ఉండిపోయారు. ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ నగరాలు నీట మునిగాయి. భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకొని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కాగా వరద బాధితులను అందుకునేందుకు సినీ లోకం కదిలింది. ఇప్పటికే చాలామంది సినీ తారలు రెండు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా వరదబాధితులకు అండగా నిలిచారు. ఈమేరకు ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయల సాయం అందించారు.

అలాగే మరో నటుడు సోనూసుద్ కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. తన టీమ్ సహాయక చర్యల్లో పాల్గొంటుందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఎవరికి ఎలాంటి సాయం కావాలన్న తనకు మెసేజ్ చేయమని.. సాయం చేయడానికి ముందుంటా అని అన్నారు సోనూ సూద్. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ రెండు తెలుగు రాష్ట్రాలకు రూ. 2 కోట్లు విరాళం ఇచ్చారు.

ఆయ్ మూవీ యూనిట్, కల్కి నిర్మాతలు అశ్విని దత్త (రూ. 25 లక్షలు), ఎన్టీఆర్( తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 1కోటి), విశ్వక్ సేన్( రూ. 10లక్షలు), సిద్ధూ జొన్నలగడ్డ(రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.30లక్షలు), సూపర్ స్టార్ మహేష్ బాబు( రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.1 కోటి ), బాలకృష్ణ (రూ. 1 కోటి), పవన్ కళ్యాణ్ ( రూ.1కోటి ), నటి అనన్య నాగళ్ళ ( రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.5లక్షలు) అందించారు. ఇక విజయవాడలో పరిస్థితి దారుణంగా ఉంది. భారీ వర్షాలు, వరదలతో విజయవాడలోని సింగ్ నగర్ అల్లకల్లోలంగా మారింది. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. అక్కడ దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు రోజులుగా వేల మంది ప్రజలు జలదిగ్బంధంలో ఉన్నారు. డ్రోన్లు,హెలికాప్టర్లతో ఆహారం, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. విజయవాడలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అల్లు అర్జున్ ట్వీట్..

సోనూ సూద్ ట్వీట్ …

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి