Pushpa 2: పుష్ప 2 గ్రాండ్ సక్సెస్.. టపాసులు కాలుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్న అల్లు అర్జున్
డిసెంబర్ 5న 'పుష్ప 2' సినిమా విడుదలైంది. డిసెంబర్ 4న చాలా చోట్ల సినిమా ప్రీమియర్ షోలు వేశారు. హైదరాబాద్‌లో 1549 షోలు వచ్చాయి. కర్ణాటకలో దాదాపు 1072 షోలు వచ్చాయి. చెన్నైలో ఈ చిత్రానికి 244 షోలు వేశారు. ఈ సినిమా తొలి రోజు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా నిన్న ( డిసెంబర్ 5న) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం తొలిరోజు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమా విజయంతో ఎన్నో సినిమాల రికార్డులు బద్దలయ్యాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయం సాధించడంతో పుష్ప 2 పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పుష్ప 1 కు మించి యాక్షన్స్, ఎమోషన్స్ ఉండటంతో పుష్ప 2ను తెరకెక్కించాడు దర్శకుడు సుకుమార్. ఇక ఈ సినిమా ఘనవిజయాన్ని సొంతం చేసుకోవడంతో అల్లు అర్జున్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర సందడి నెలకొంది. టపాసులు కాలుస్తూ.. పుష్ప 2 సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నారు అల్లు అర్జున్. అలాగే అల్లు అర్జున్ ఇంటి దగ్గర అభిమానుల సంబరాలు చేసుకున్నారు.