AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun : బ్రదర్స్ ఇద్దరు ఒకే సీజన్ లో సూపర్ హిట్ కొట్టారన్న ఐకాన్ స్టార్.. ఆ ఇద్దరు ఎవరంటే..

మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ పతాకంపై అఖిల్ అక్కినేని ,బుట్ట బొమ్మ పూజా హెగ్డే  హీరో, హీరోయిన్లుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.”

Allu Arjun : బ్రదర్స్ ఇద్దరు ఒకే సీజన్ లో సూపర్ హిట్ కొట్టారన్న ఐకాన్ స్టార్.. ఆ ఇద్దరు ఎవరంటే..
Bunny
Rajeev Rayala
|

Updated on: Oct 21, 2021 | 8:49 PM

Share

Allu Arjun : మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ పతాకంపై అఖిల్ అక్కినేని ,బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.” భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా కలసి నిర్మించిన ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని ఏరియాల నుండి హిట్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శించ బడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్ ల్లో గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  హీరో అల్లు అర్జున్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాలుపంచుకొని ఇంత మంచి సినిమా తీసిన చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న అఖిల్ కు కంగ్రాజులేషన్ అన్నారు. అఖిల్ ని చూస్తే నాకు యంగర్ బ్రదర్ లా అనిపిస్తుంది.. అఖిల్ సినిమా రాకముందే నేను నాగార్జున సార్ ని కలిశాను అఖిల్ ని ఇలా చేస్తే బాగుంటుందా అనేసి నా చిన్న సలహా ఇచ్చా అన్నారు. ఇష్టం ఉంది కాబట్టే వేరే ఫ్యామిలీ హీరో అయినా కూడా నేను వెళ్లి చెప్పడం జరిగింది. అలాంటి అఖిల్ కి ఈ రోజు ఇంత పెద్ద హిట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు అల్లు అర్జున్. అఖిల్ చాలా బాగా డాన్స్ చేస్తాడు బాగా ఫైట్ చేస్తాడు ఇవన్నీ చేయగలిగి కూడా మంచి ఫ్యామిలీ సబ్జెక్టు ను సెలెక్ట్ చేసుకొని ఒక మంచి క్యారెక్టర్ ఉన్న సినిమా చేశాడు. అందుకే ఈరోజు ఈ సినిమా  ఇంత బాగా రావడానికి కారణమైంది అన్నారు. తను ఎన్నుకున్న కథ చాలా బాగుంది. రియల్లీ అప్రిషియేట్. మా నాన్నగారు చెప్పినట్టు ఎక్కడున్నా అక్కినేని నాగేశ్వరరావు గారు మా తాత  అల్లు రామలింగయ్య గారు ఈ సక్సెస్ ను చూస్తుంటారు. అక్కినేని గారి ఫ్యామిలీ‌తో మా ప్రయాణం చాలా సంవత్సరాలుగా సాగుతుంది.ఫ్యూచర్ లో కూడా మా జర్నీ అలాగే కంటిన్యూ సాగుతుంది.. లవ్ స్టోరీ సినిమా ద్వారా చైతన్య , ఇపుడు అఖిల్ ఇద్దరూ మంచి సక్సెస్‌ను అందుకున్నారు. ఇద్దరు బ్రదర్స్ కూడా ఒకే సీజన్ లో సూపర్ హిట్ కొట్టారు అన్నారు. పూజాను నేను డీజే నుంచి చూస్తున్నాను సినిమా తర్వాత సినిమా తన పెర్ఫార్మన్స్ తో బెటర్మెంట్ ఇస్తూ ఉంది.  గోపి సుందర్ కి తెలుగు రాకపోయినా చాలా అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. బన్నీ వాసు గారు మరొక బిగ్ హిట్ ని అందు కున్నాడు.  మా నాన్నగారిని నేను నలభై సంవత్సరాలుగా చూస్తున్నాను ఆయన ఎప్పుడు కష్ట పడుతూనే ఉంటాడు. మా ఫాదర్ పెద్ద, పెద్ద స్టార్ హీరోలతో, కొత్త వాళ్లతో తర్డ్ జనరేషన్ హీరోస్ తో ఇలా అందరితో పని చేస్తూ మంచి కథలతో బెస్ట్ మూవీస్ ఇస్తున్నాడు. టీం అంతా ఎంతో కష్టపడి  మెమరబుల్ ఫిల్మ్ ఇచ్చారు. మంచి సినిమా తీస్తే థియేటర్లకు జనాలు వస్తారని ఈ సినిమా నిరూ పించింది.ఇంత  పెద్ద విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు అల్లు అర్జున్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Keerthy Suresh: చీరకట్టులో చందమామలా నేటి ‘మహానటి’.. ‘కీర్తీసురేష్’ లేటెస్ట్ ఫోటోస్..

Kichcha Sudeepa : ‘కోటికొక్కడు’గా కిచ్చా సుదీప్.. ఆకట్టుకుంటున్న ట్రైలర్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..