AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha OTT: ‘ఆహా’ను ఈ స్థాయికి తీసుకెళ్లిన మీడియాకు అభివందనాలు.. ఆసక్తికర విషయం వెల్లడించిన అల్లు అరవింద్..

Allu Aravind In Aha First Anniversary: తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ ఈ స్థాయిలో విజయవంతమైందంటే దానికి కారణం మీడియానేనని అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘ఆహా’ ఓటీటీ ప్రారంభమై...

Aha OTT: ‘ఆహా’ను ఈ స్థాయికి తీసుకెళ్లిన మీడియాకు అభివందనాలు.. ఆసక్తికర విషయం వెల్లడించిన అల్లు అరవింద్..
Narender Vaitla
|

Updated on: Feb 08, 2021 | 10:02 PM

Share

Allu Aravind In Aha First Anniversary: తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ ఈ స్థాయిలో విజయవంతమైందంటే దానికి కారణం మీడియానేనని అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘ఆహా’ ఓటీటీ ప్రారంభమై నేటితో (సోమవారం) ఏడాది పూర్తయిన సందర్భంగా.. తొలి వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ‘ఆహా’ వ్యవస్థాపకుల్లో ఒకరైన అల్లు అరవింద్ మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహాలో వచ్చిన ప్రతీ షోను, కంటెంట్‌ను మీడియా చాలా ఓపికగా రాస్తూ, చూపిస్తూ ప్రేక్షకులకు చేరవేశారని అన్నారు. ఆహా విజయ ప్రస్థానంలో మీడియాదే కీలకపాత్ర అని అరవింద్ అభిప్రాయపడ్డారు. నిజానికి ఈ తొలి వార్షికోత్సవ వేడుకను చాలా గ్రాండ్‌గా నిర్వహించాల్సి ఉండగా.. కొంతమంది ముఖ్యమైన వాళ్లు ఊరిలో లేరు అందుకే.. ఇలా సింపుల్‌గా చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. నిజానికి ‘ఆహా’ ప్రస్తుతం సాధించిన గణాంకాలను వారి టీమ్ 2022 మార్చి నాటికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారట కానీ ఏడాదిలో చేరుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా టీమ్ పనిచేసింది కాబట్టే ‘ఆహా’ ఈరోజు ఈ స్థాయిలో ఉందని తెలిపారు. ఇక ఇదే వేదికపై అల్లు అరవింద్.. జూపల్లి రామేశ్వర రావుపై అభినందనలు కురిపించారు. ‘ఈ స్టేజీ మీదికి రాకుండా.. మీకెవరకీ కనిపియ్యకుండా.. మా వెనక బలంగా ఉంది రామేశ్వర రావు గారు. ఆయనకి ఈ స్టేజీ మీద థ్యాంక్యూ చెప్పకపోతే నాది తప్పవుతుంది. ఆహా వెనక ఉన్న రామేశ్వ రావు గారికి బిగ్ థ్యాంక్యూ’ అంటూ చెప్పుకొచ్చారు.

Also Read: DSP – Keerthi Suresh Photos: రాక్‌స్టార్ DSPకు సంగీతం నేర్పించిన కీర్తి సురేష్..రంగ్ దే మూవీ ముచ్చట్లు.

Follow Us
అబ్బబ్బో.. వీటిని టేస్ట్ చేస్తే వదిలి పెట్టరు.. మీరు ట్రై చేయండి!
అబ్బబ్బో.. వీటిని టేస్ట్ చేస్తే వదిలి పెట్టరు.. మీరు ట్రై చేయండి!
పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే మఖానా దోశలు.. ఎలా చేయాలంటే?
పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే మఖానా దోశలు.. ఎలా చేయాలంటే?
రక్తం ఇస్తే డబ్బులిచ్చే కుర్చీ..OTTలో భయపెడుతోన్న తెలుగు సినిమా
రక్తం ఇస్తే డబ్బులిచ్చే కుర్చీ..OTTలో భయపెడుతోన్న తెలుగు సినిమా
తేడాగా ఉందని ఆపి చెక్ చేశారు! లోపల స్పెషల్ రూమ్.. అందులో..
తేడాగా ఉందని ఆపి చెక్ చేశారు! లోపల స్పెషల్ రూమ్.. అందులో..
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో