AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bachala Malli: బచ్చల మల్లి టీజర్ రివ్యూ.. అల్లరోడిలో మరో యాంగిల్..!

అల్లరి నరేష్ కన్ఫ్యూజన్‌లో ఉన్నారా..? ఎటువైపు వెళ్లాలో తెలియని డైలమాలో పడిపోయారా..? ఓసారి కామెడీ.. మరోసారి సీరియస్ అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారా..? ఈ డౌట్ ఇప్పుడెందుకు వచ్చిందబ్బా అనుకోవచ్చు..

Bachala Malli: బచ్చల మల్లి టీజర్ రివ్యూ.. అల్లరోడిలో మరో యాంగిల్..!
Bachalamalli Teaser
Praveen Vadla
| Edited By: |

Updated on: Nov 29, 2024 | 7:34 AM

Share

అల్లరి నరేష్ కన్ఫ్యూజన్‌లో ఉన్నారా..? ఎటువైపు వెళ్లాలో తెలియని డైలమాలో పడిపోయారా..? ఓసారి కామెడీ.. మరోసారి సీరియస్ అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారా..? ఈ డౌట్ ఇప్పుడెందుకు వచ్చిందబ్బా అనుకోవచ్చు.. కానీ ఆయన చేస్తున్నది చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. తాజాగా బచ్చల మల్లి టీజర్ విడుదలైంది. ఇది నరేష్‌లోని మరో యాంగిల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. అల్లరి నరేష్‌ను సీరియస్‌గా చూడటం కంటే.. కామెడీ రోల్స్‌లో చూడ్డానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఆడియన్స్. కానీ ఆయన మాత్రం సీరియస్ రోల్స్ కూడా ఇరగదీస్తారు.. అందులో అనుమానం లేదు. అందుకే ఈ మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారు నరేష్. ఓ వైపు కామెడీ.. మరోవైపు సీరియస్.. రెండింటి మధ్యలో నలిగిపోతున్నాడు అల్లరోడు.

రెండేళ్ల కింద నాందీతో సీరియస్ టర్న్ తీసుకున్న నరేష్.. తర్వాత మారేడుమిల్లి నియోజకవర్గం, ఉగ్రం సినిమాలతో వచ్చారు. ఇక నా సామిరంగాలోనూ నవ్విస్తూనే.. ఏడిపించారు నరేష్. ఈ మధ్యే ఆ ఒక్కటి అడక్కులో కామెడీ చేసారు. కానీ అది అస్సలు వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో బచ్చల మల్లితో వస్తున్నాడు నరేష్. తాజాగా టీజర్ చూస్తుంటే.. జులాయిగా పెరిగిన మల్లి అనే కుర్రాడి కథే ఇది. చిన్నప్పటి నుంచే వ్యసనాలకు బానిస అయిపోతాడు.. ఎవరి మాట వినడు.. మూర్ఖుడు.. అలాంటి వాడి జీవితంలోకి ఓ అమ్మాయి వస్తే ఆ తర్వాత బచ్చల మల్లి ఎలా మారిపోయాడు అనే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుబ్బు.

టీజర్ అంతా అల్లరి నరేష్‌ను వీలైనంత కొత్తగా చూపించడానికే ప్రయత్నించాడు దర్శకుడు సుబ్బు. సోలో బ్రతుకే సో బెటర్ తర్వాత మూడేళ్ళకు పైగా గ్యాప్ తీసుకుని ఈయన చేస్తున్న సినిమా ఇది. బచ్చల మల్లి తన మార్కెట్ మరింత పెంచుతుందని నమ్మకంగా ఉన్నాడు నరేష్. ఇందులో కామెడీతో పాటు యాక్షన్‌కు కూడా ఢోకా లేకుండా చూసుకుంటున్నాడు సుబ్బు. టీజర్‌లోనూ అదే చేసాడు. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుంది. సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. ప్రతీ సినిమాలోను నరేష్ పేరు ముందు అల్లరి అని ఉంటుంది. కానీ బచ్చల మల్లిలో అది మాయమైంది. అంటే ఇకపై అల్లరికి దూరంగా ఉండి.. సీరియస్ సినిమాలు చేయాలనుకుంటున్నారా అనేది సస్పెన్సే. ఏం చేసినా.. నరేష్‌కు అయితే ఇప్పుడో బ్లాక్‌బస్టర్ అవసరం చాలా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒడిలో చంటిబిడ్డతో రేణూ దేశాయ్.. ఫొటోస్ వైరల్.. ఇంతకీ ఎవరీ బేబీ?
ఒడిలో చంటిబిడ్డతో రేణూ దేశాయ్.. ఫొటోస్ వైరల్.. ఇంతకీ ఎవరీ బేబీ?
బంగారం Vs వెండి Vs స్టాక్స్.. 2026లో కాసుల వర్షం కురిపించేది..
బంగారం Vs వెండి Vs స్టాక్స్.. 2026లో కాసుల వర్షం కురిపించేది..
చలిమంటలతో తస్మాత్ జాగ్రత్త...
చలిమంటలతో తస్మాత్ జాగ్రత్త...
కొత్త ఏడాదిలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే భారీ మూల్యం తప్పదు!
కొత్త ఏడాదిలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే భారీ మూల్యం తప్పదు!
తెలంగాణలో టెట్ నిర్వహణకు సర్వం సిద్ధం.. ఇదిగో పూర్తి వివరాలు
తెలంగాణలో టెట్ నిర్వహణకు సర్వం సిద్ధం.. ఇదిగో పూర్తి వివరాలు
వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుంది.. దాని వెనుక ఉన్న సైన్స్ తెలిస్తే
వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుంది.. దాని వెనుక ఉన్న సైన్స్ తెలిస్తే
భార్యని భర్త ఖర్చుల లెక్కలు అడగటం తప్పా?
భార్యని భర్త ఖర్చుల లెక్కలు అడగటం తప్పా?
'ది రాజాసాబ్' కోసం ప్రభాస్ ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?
'ది రాజాసాబ్' కోసం ప్రభాస్ ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో అప్డేట్.. ఈ ఏడాది ఎన్ని రైళ్లంటే..
వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో అప్డేట్.. ఈ ఏడాది ఎన్ని రైళ్లంటే..
కోహ్లీ అంటే ఆమాత్రం ఉండాలి మరి..లేడీ క్రికెటర్ మనసు దోచేసిన కింగ్
కోహ్లీ అంటే ఆమాత్రం ఉండాలి మరి..లేడీ క్రికెటర్ మనసు దోచేసిన కింగ్