రియల్ హీరో.. ట్రాన్స్‌జెండర్లకు అక్షయ్ కోటిన్నర విరాళం

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా ఆయన ఎవర్‌గ్రీన్. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. తాజాగా ఆయన తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. తమిళనాడుకు చెందిన ట్రాన్స్‌జెండర్స్‌ కోసం గృహ నిర్మాణానికి రూ.కోటిన్నర నగదును విరాళంగా ప్రకటించారు.

  • Ram Naramaneni
  • Publish Date - 6:19 pm, Sun, 1 March 20
రియల్ హీరో.. ట్రాన్స్‌జెండర్లకు అక్షయ్ కోటిన్నర విరాళం

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా ఆయన ఎవర్‌గ్రీన్. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. తాజాగా ఆయన తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. తమిళనాడుకు చెందిన ట్రాన్స్‌జెండర్స్‌ కోసం గృహ నిర్మాణానికి రూ.కోటిన్నర నగదును విరాళంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కును నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌తో కలిసి ఆదివారం ట్రాన్స్‌జెండర్స్‌కు బహుకరించారు. ఈ విషయాన్ని లారెన్స్ ట్విట్టర్‌లో ఫోస్ట్ చేశారు.  ట్రాన్స్‌జెండర్లకు  గృహ నిర్మాణం కోసం ఓ హీరో​ ఇంత పెద్దమొత్తంలో విరాళం ప్రకటించడం దేశంలోనే తొలిసారని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం అక్షయ్ లారెన్స్ దర్శకత్వం వహిస్తోన్న ‘లక్ష్మీ బాంబ్’ చిత్రంలో నటిస్తున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ సమయంలో లారెన్స్ ట్రాన్స్‌జెండర్ల కోసం చెన్నైలో ఓ భవనాన్ని నిర్మిస్తున్నట్లు అక్షయ్ తెలుసుకున్నారు. ఇంత మంచిపనిలో తాను కూడా భాగం అవ్వాలనుకున్న అక్షయ్.. భారీ విరాళాన్ని ప్రకటించారు. ‘కాంచన’ మూవీ చేస్తోన్న సమయంలో చాలామంది ట్రాన్స్‌జెండర్లని కలిశానని చెప్పిన లారెన్స్..వారి దీనగాథలు విన్న తర్వాత భవన నిర్మాణానికి పూనుకున్నట్టు తెలిపారు.

ఇది కూడా చదవండి : పెన్షన్ పంపిణీలో జాప్యం..ఇద్దరు గ్రామ వాలంటీర్లపై స్పాట్‌లో వేటు..