పెన్షన్ పంపిణీలో జాప్యం…ఇద్దరు గ్రామ వాలంటీర్లపై స్పాట్‌లో వేటు..

సంక్షేమం విషయంలో ఏపీ సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. పలు జనరంజకమైన పథకాలతో ముందుకు సాగుతోంది. మరోవైపు నవరత్నాలు అమలులో కూడా ప్రత్యేక శ్రద్ద కనబరుస్తోంది. కాగా వాలంటీర్ల ద్వారా పెన్షన్లను ఇంటికి లబ్దిదారులకు ఇంటికి పంపిస్తోన్న విషయం తెలిసిందే.

పెన్షన్ పంపిణీలో జాప్యం...ఇద్దరు గ్రామ వాలంటీర్లపై స్పాట్‌లో వేటు..
Follow us

|

Updated on: Mar 01, 2020 | 7:18 PM

సంక్షేమం విషయంలో ఏపీ సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. పలు జనరంజకమైన పథకాలతో ముందుకు సాగుతోంది. మరోవైపు నవరత్నాలు అమలులో కూడా ప్రత్యేక శ్రద్ద కనబరుస్తోంది. కాగా వాలంటీర్ల ద్వారా పెన్షన్లను లబ్దిదారులకు ఇంటికి పంపిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా పెన్షన్  పంపిణీలో జాప్యం చేశారంటూ ఇద్దరు గ్రామ వాలంటీర్లను ఉన్నపళంగా విధుల్లోంచి తొలంగిచారు మంత్రి పేర్ని నాని.

మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 21వ వార్డు జవ్వారుపేట టేక్యా ప్రాంతంలో ఆదివారం మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో 10వ వార్డులో  పెన్షన్లు పంపిణీ చేయడంలో గ్రామ వాలంటీర్లు అలసత్వం వహించారని..స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.  దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పేర్ని నాని..సదరు వాలంటీర్లను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పర్యవేక్షణలో అలసత్వం వహించిన అడ్మిన్ నవీన్‌పై చర్యలుంటాయని మంత్రి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి : మారుతీరావు షెడ్‌లో మృతదేహం కేసులో మరో ట్విస్ట్…ఆయిల్ చల్లి..